- పవన్ అభిమానులకు నా స్థాయి గురించి ప్రశ్నించేంత సీన్ ఉందా?
- ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్.. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్
- పవన్ కల్యాణ్ బీ కేర్ ఫుల్ కత్తి మహేష్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద.. ఆయన అభిమానుల మీద విమర్శల దాడిని మరింత పెంచాడు ఫిలిం క్రిటిక్ మహేష్ కత్తి. పవన్ ను విమర్శించే స్థాయి తనకు లేదంటూ అతడి అభిమానులు తనను తిట్టడంపై కత్తి తీవ్రంగా స్పందించాడు. ఒక చర్చా కార్యక్రమంలో భాగంగా అసలు పవన్ స్థాయి ఏంటి అని అతను ప్రశ్నించాడు. ‘‘అసలు పవన్ అభిమానులకు నా స్థాయి గురించి ప్రశ్నించేంత సీన్ ఉందా? అసలు పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి? ఆయన ఇంటర్మీడియట్ ఫెయిలయ్యాడు. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్. పవన్ పెద్ద కాపు నేను మాదిగ. ఇదేనా స్థాయి? స్థాయి గురించి ఇంకొక్క మాట మాట్లాడితే బాగుండదు. మర్యాద ఉండదు పవన్ అభిమానులకు. పవన్ కల్యాణ్ బీ కేర్ ఫుల్. నా దగ్గర స్థాయి గురించి మాట్లాడకండి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్ ను రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి’’ అని కత్తి అన్నాడు.శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ను బూతు తిట్టిన వివాదం ఎప్పుడో ముగిసిపోయి ఉండాల్సిందని.. కానీ దీనిపై పవనే రాజకీయం చేస్తున్నాడని కత్తి అభిప్రాయపడ్డాడు. ‘‘శ్రీరెడ్డి తప్పుడు మాట వాడింది. ఆ అమ్మాయి తప్పు ఒప్పుకుంది. వర్మ తానే ఆ అమ్మాయిని ప్రోత్సహించానని తప్పును ఒప్పుకున్నాడు. దీనికి బాధ్యత వహిస్తూ క్షమాపణ చెప్పాడు. అక్కడితో ఆ గొడవ ముగిసిపోయింది. వీళ్లు నాకు సారీ చెప్పారని పవన్ వాళ్లను క్షమించేసి కాస్టింగ్ కౌచ్ సమస్య మీద దృష్టిసారించి ఉంటే.. పరిష్కారం కోసం ప్రయత్నించి ఉంటే నిజంగా ఆయన సూపర్ హీరో అయి ఉండేవాడు. అందరం అభిమానించేవాళ్లం. కానీ అలా చేయకుండా కేవలం మదర్ సెంటిమెంట్ ను వాడుకుని ఆయన తన రాజకీయ ప్రయోజనాలను పొందడానికి ప్రయత్నిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. వర్మకు టీవీ ఛానెళ్లతో అనవసర సంబంధం అంటగట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు పవన్. తనను బూతు మాట అనిపించడానికి మీడియా మొత్తం కలిసింది అంటున్నాడు. ఇక్కడ రాజకీయం చేస్తోంది ఒక్క పవన్ కల్యాణే’’ అని కత్తి స్పష్టం చేశాడు.
Related Posts