YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పార్లమెంట్ రాష్ట్రపతి స్పీచ్ బాయ్ కాట్

పార్లమెంట్ రాష్ట్రపతి స్పీచ్ బాయ్ కాట్

న్యూఢిల్లీ, జనవరి 28, 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి‍ రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం చేయనుండగా.. సమావేశాలను బాయ్‌కాట్ చేస్తున్నట్లు 16 పార్టీలు ప్రకటించాయి. వ్యవసాయ చట్టాల రద్దు చేయాలని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. రిపబ్లిక్ డే రోజు చోటుచేసుకున్న ఘటనలపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాయి. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులు ఎవరున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నాయి.నూతన వ్యవసాయ చట్టాల కారణంగా ఆహర భద్రతకు విఘాతం కలుగుతుందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలను ఆమోదింపజేసుకున్నారని దుయ్యబట్టాయి. ఈ మేరకు గురువారం 16 ప్రతిపక్ష పార్టీలు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశాయి.బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్.. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్ పార్టీలు ఈ సమావేశాలను బహిష్కరించనున్నాయి.
ఉభ‌య స‌భ‌ల్లో సాగు చ‌ట్టాల‌ను బ‌ల‌వంతంగా ఆమోదం చేయించారని.. అందుకే రైతులు ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ 64 రోజులుగా ఆందోళన చేస్తున్నారని విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌ అన్నారు. ఈ ఆందోళనల్లో 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడాన్ని ఖండించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో ప్రభుత్వం ఆహార ఉత్పత్తులను సేకరించడం నిలిచిపోతుందని.. ప్రజా పంపిణీ వ్యవస్థపై ఇది ప్రభావం చూపుతుందని ఆజాద్ ఆందోళన వ్యక్తంది

Related Posts