YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో

 పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో

విజయవాడ, జనవరి 28, 
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అధినేత చంద్రబాబు గురువారంటీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారు. పల్లె ప్రగతి-పంచ సూత్రాల పేరుతో, ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో మేనిఫెస్టో విడుదల చేసినట్లు చెప్పారు. గ్రామాల్లో సమర్ధవంతమైన పాలన కోసమే ఈ పంచ సూత్రాలని అన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు.. యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
1) ఉచిత కుళాయిలతో రక్షిత మంచినీరు
2) భద్రత-ప్రశాంతతకు భరోసా
3) ఆలయాలపై దాడులు అరికట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు భద్రత
4) స్వయం సంవృద్ధి కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లను అడ్డుకోవడం
5) ఆస్తి పన్ను తగ్గించి పౌర సేవలు అందిస్తాం.. స్వచ్ఛత పరిశుభ్రత పాటిస్తూ ఆదర్శ గ్రామలు తీర్చిదిద్దటంరాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చెబుతున్న ఏకగ్రీవాలు ప్రజల ఆమోదంతో జరిగేవి కాదని.. దౌర్జన్యాలు, దాడులతో భయపెట్టి చేసే బలవంతపు ఏకగ్రీవాలని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ విధ్వంసాలే ఉదాహరణ అన్నారు. 2014లో 2.6శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే... 2020లో 20శాతం పైగా ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. 2014లో ఒక్క జడ్పీటీసీనే ఏకగ్రీవమైతే ఇప్పుడు పదుల సంఖ్యలో ఎలా చేయగలిగారని ప్రశ్నించారు. 20 నెలల పాలనలో ఏం చేసారని ఓటేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎన్నికల్లో పోటీ చేయాలని పిలుపునిచ్చారు.వైఎస్సార్‌సీపీ నిధులపై రుచి మరిగారన్నారు చంద్రబాబు. గద్దల్లా వాలిపోయి దోచేయాలని చూస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టుల్లో జడ్జిలు మారినా.. న్యాయం మారదన్నారు. ప్రజలు తిరగబడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. రాష్ట్రంలో ఏం జరిగినా తానే కారణమని చెప్పడానికి సిగ్గుండాలి అన్నారు.

Related Posts