YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కొత్త డ్రామా బండి సంజయ్

కేసీఆర్ కొత్త డ్రామా బండి సంజయ్

పాలభిషేకాలకోసం తాపాత్రయపడే సీఎం కేసీఆర్ మళ్ళి ఒక కొత్త  డ్రామాకు తెర తీశారు.  కేవలం తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే సీఎస్ నేతృత్వం లోని త్రిసభ్యకమిటీ బిస్వాల్ రిపోర్ట్ పై అభిప్రాయ సేకరణకు పిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన అనుకూల సంఘాల తో చర్చించి, వాళ్లతో పాలాభిషేకం చేయించు కోవాలని అనుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ఇప్పటికే దుబ్బాక లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్లు లేదు.  అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్ షన్ దారుల సంఘాలను చర్చకు పిలవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. రాష్ట్రం లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారులను నట్టేట ముంచినట్టు బిస్వాల్ కమిటీ రిపోర్ట్  ఉందని లక్షలాది మంది కడుపు మంటతో రగిలి పోతుంటే సీఎం ఎక్కడ పడుకున్నాడు. ఇప్పటిదాకా ఎందుకు స్పందించడం లేదని అయన అన్నారు.


7.5% ఫిట్ మెంట్ ను ముందు పెట్టి పెండింగ్ లో ఉన్న ఎన్నో ఉద్యోగ సమస్యలు తెర పైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేశాడు. ఆయన ప్లాన్ ప్రకారమే  ఇప్పుడు త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ వైపు డైవర్ట్ అయింది. 014 లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఉద్యోగులకు కల్పించాల్సిన ఈహెచ్ఎస్  అమలు కావడం లేదు, ఎక్కడా క్యాష్-లెస్ ట్రీట్ మెంట్ లేదు. కరోన బాధిత ఉద్యోగులకు ఒక లక్ష సాయం చేస్తామని చేతులు దులుపుకొన్నారు. కరోన బారిన పడ్డ ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని అప్పుల పాలయ్యారు.


ఎన్టీవోలకు ఎల్టీసీ లేకుండా పోయింది. భార్య భర్తల ట్రాన్స్ ఫర్ లు ఇంకేప్పుడు.  త్రిసభ్య కమిటీ ముందు ఈ అంశాలన్నీ చర్చకు రావాల్సిందే. ప్రభుత్వం తమపట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులంతా రగిలిపోతుంటే సీఎం కేసీఆర్ కు పెనుకుట్టినట్లు కూడా లేదు.  పైగా ప్రభుత్వ వైఖరి పై గొంతెత్తే వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంది. వాళ్ళను వేధిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగ బంధువు లారా మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు జరిగిన అన్యాయాన్ని పంటి బిగువున భారించాల్సిన అవసరం లేదు. మీకు బీజేపీ అండగా ఉందని అయన అన్నారు.
 

Related Posts