YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

యువత సామాజిక సేవలో ముందు ఉండాలి - కాంగ్రెస్ పెద్దపెల్లి పార్లమెంట్ నాయకులు గోమాస శ్రీనివాస్

యువత సామాజిక సేవలో ముందు ఉండాలి - కాంగ్రెస్ పెద్దపెల్లి పార్లమెంట్ నాయకులు గోమాస శ్రీనివాస్

యువత సామాజిక సేవలో ముందుండాలని బుధవారం రాత్రి టాలెంట్ డాన్స్ అకాడమీ పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దపెల్లి పార్లమెంట్ సీనియర్ నాయకులు గోమాస శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గా మందమర్రి పరిసర ప్రాంతాలలో కరోనా  సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన ప్రజా సేవ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ తో పాటు సొసైటీ సభ్యులను టాలెంట్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆయన సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత శివ కార్యక్రమంలో ముందు ఉండాలని ఇలాగే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సేవ అ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు షేక్ అజీమోద్దీన్ మాట్లాడుతూ మేము చేసినటువంటి సేవలను గుర్తించి ఈ సన్మానానికి ఎన్నిక చేసినందుకు టాలెంట్ డాన్స్ అకాడమీ సునార్కర్ రాంబాబు, అలాగే గోమాస శ్రీనివాసన్ కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

Related Posts