YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ వడదెబ్బలు...!

తెలుగు రాష్ట్రాల్లోనే  ఎక్కువ వడదెబ్బలు...!
ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు విజృంభిస్తున్నాయి. దేశ‌వ్యాప్తంగా వేడిగాలుల కార‌ణంగా వేల‌మంది చ‌నిపోయారు. అందులో ఎక్కువ మ‌ర‌ణాలు తెలుగు రాష్ట్రాల్లోనే.. ఇంతకీ అధిక ఉష్ణోగ్రతలకు కారణమేంటి ? రికార్డు ఉష్ణోగ్రతలు నమోదైతే పరిస్థితి ఏంటి ? ఈ వేసవి మరింత వేడి పుట్టిస్తోంది. సూర్యుడు త‌న ప్రతాపంతో అల్లాడిస్తున్నాడు. మండే ఎండలు జనం మాడు ప‌గ‌ల‌కొడుతున్నాయి. రోహిణి కార్తెలో ఉండే పరిస్థితులు... ఈ వేసవి కాలమంతా క‌నిపిస్తున్నాయి. విజృభించే వడగాలులు, వేడి వాతావరణం ఆగమాగం చేయనున్నాయి. మొత్తంగా ఈ ఎండాకాలంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. ఏటా ఎండ‌కాలంలో ప్ర‌త్యేకంగా కొన్నిరోజుల పాటు వ‌డ‌గాల్పులు వీస్తుంటాయి. కొన్ని ద‌శాబ్దాలుగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఎండ‌లు పెరిగిపోతుండ‌టంతో వడ‌గాలులు వీస్తున్న రోజుల సంఖ్య కూడా పెరిగిపోతున్న‌వి. భూ విజ్నాన మంత్రిత్వ శాఖ లెక్క‌ల ప్ర‌కారం 1961-70 మ వ‌ర‌కు ఏటా స‌గ‌టున 74 రోజులు వ‌డ‌గాలులు వీచాయి. 1971-80 మ‌ధ్య ఈ సంఖ్య 34 రోజుల‌కు ప‌డిపోయింది. ఆ త‌ర్వాతా క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తోంది. 1981-90 లో ఏటా స‌గ‌టున 45 రోజులు వ‌డ‌గాల్పులు వీయ‌గా... 1991-2000 మ‌ధ్య అవి 48 రోజుల‌కు పెరిగాయి. 2001-2010 మ‌ధ్య ఈ సంఖ్య ఏకంగా రెట్టింప‌య్యింది. ఈ ద‌శాబ్ధంలో రికార్డ్ స్థాయిలో స‌గ‌టున 98 రోజుల పాటు.. వ‌డ‌గాల్లు వీచి జ‌నానికి చుక్క‌లు చూపించాయి. 2011 నుంచి ఏటా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. గ‌త ద‌శాబ్ధం క‌న్నా ఎక్కువ రోజులు వ‌డ‌గాలులు వీస్తున్నాయి. 2016 సంవ‌త్స‌రం ఈ శ‌తాబ్ధంలోనే అత్యంత వేడి సంవ‌త్స‌రంగా భార‌త వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది. వాతావ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా నాలుగేళ్ల‌లో దేశ‌వ్యాప్తంగా 4620 మంది మృతి చెందిన‌ట్లు భూవిజ్నాన శాస్త్ర‌ల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో 4246 మ‌ర‌ణాలు తెలుగు రాష్ట్రాల్లోనే జ‌రిగిన‌ట్లు పేర్కొంది ఈ మ‌ర‌ణాల సంఖ్య‌ను త‌గ్గించేందుకు భార‌త వాతావ‌ర‌ణ శాఖ గ‌తేడాది నుంచి వ‌డ‌గాల్పుల హెచ్చ‌రిక‌ల్ని విడుద‌ల చేస్తోంది. సాధార‌ణ ఉష్ణోగ్ర‌త‌ల‌కు మించి 4-5 డిగ్రీలు పెరిగితే వ‌డ‌గాలులు వీచే అవ‌కాశం ఉంది. ఆరు డిగ్రీలు క‌న్నా ఎక్కువ‌గా పెరిగితే తీవ్ర‌మైన వ‌డ‌గాల్పులు వీచే అవ‌కాశం ఉందంటూ హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. ఇక మన రాష్ట్రాల విషయానికొస్తే... ఈ సారి వడగాలులు సాధారణం కన్నా 47 శాతం ఎక్కువగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారుల అంచ‌నా. ఏపీ, తెలంగాణ‌, ఒడిషాల్లోనే వ‌డ‌గాల్పులు ఎక్కువ‌. ఎందుకంటే.. వేస‌విలో రాజ‌స్థాన్ , గుజ‌రాత్ లో తుపాను వ్య‌తిరేక గాలి వీస్తుంది. అది అక్క‌డి ఎడారుల్లోని పొడి వేడిగాలుల‌తో క‌లిసి మ‌ధ్య‌ప్ర‌దేశ్ మీదుగా ఏపీ తెలంగాణ ఒడిసాలకు వీస్తుంఇ. ఈ గాలి వ‌ల్ల మ‌న‌కు వ‌డ‌గాల్పులు పెరుగుతాయి. అరేబియా స‌ముద్రంలో తుపాను ప‌రిస్థితులు ఏర్ప‌డే వ‌ర‌కు వ‌డ‌గాల్పుల ప్ర‌భావం కొన‌సాగుతుంది. తుపాను వ్య‌తిరేక గాలి అరేబియా స‌ముద్రంలోకి వెళ్తిపోతే... వ‌డ‌గాలులు త‌గ్గిపోతాయి. మ‌రోవైపు ఎల్ నినో పై ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి క్లారిటీ రాలేదు. స్కైమెట్, అంత‌ర్జాతీయ సంస్థ‌లు ఎల్ నినో ఉన్నాయ‌ని చెబుతుంటే.. ఐఎం డీ మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావ‌ర‌ణ అంచ‌నాల సంస్థ స్కైమెట్... గ‌త నెలాఖ‌రులో 2015-16 లో వ‌చ్చిన తీవ్ర ఎల్ నినో ప‌రిస్థితులు ఈ ఏడాది కూడా రానున్నాని తెలిపింది. జూన్ సెప్టెంబ‌ర్ రెండో అర్థ‌భాగంలో ఎల్ నినో ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపింది. ఐఎండీ అప్ప‌ట్లో ఎల్ నినో ప్ర‌భావం పెద్ద‌గా ఉండ‌బోద‌నిచెప్పింది. తాజాగా అస‌లు ఉండ‌ద‌ని అంటోంది ఐఎండీ. ద‌క్షిణ అమెరికాకు స‌మీపంలో భూమ‌ధ్య రేఖ‌కు కొంచెం అటుఇటుగా స‌ముద్ర ఉప‌రిత‌ల నీరు వెచ్చ‌బ‌డితే దాన్ని ఎల్ నినో అంటారు. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న ప‌రిస్థితుల్ని చూస్తే... ఎల్ నినో ఏర్ప‌డేందుకు 50 శాతం అవ‌కాశాలున్నాయి. ప‌సిఫిక్ మ‌హాస‌ముద్ర ప్రాంతంలో ఇప్ప‌టికైతే ఉప‌రిత‌ల నీటి ఉష్ణోగ్ర‌త‌లు సాధార‌ణం

Related Posts