YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పవన్ వర్సెస్ జగన్

పవన్ వర్సెస్ జగన్

ఏలూరు, జనవరి 29, 
అటు సీఎం జ‌గ‌న్.. ఇటు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాన్ సైలెంట్ గానే ఉన్నారు. జ‌‌న‌సేన లీడ‌ర్లు కూడా ఇన్నాళ్లూ సైలెంట్ గానే ఉన్నా.. పంచాయితీ ఎన్నిక‌ల విష‌యంలో బానే మూవ్ అవుతున్నారు. ఎన్ని సీట్లు వ‌స్తాయి.. అస‌లు ఎంత మంది పోటీ చేస్తారు అనే విష‌యం ప‌క్క‌న పెడితే.. వైసీపీ పై వాయిస్ రెయిజ్ చేస్తోంది జ‌న‌సేన పార్టీ. గ్రౌండ్ లెవ‌ల్లో వైసీపీ చేస్తున్న బెదిరింపుల గురించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తుంది జ‌న‌సేన‌. దీనిపై గ‌వ‌ర్న‌ర్ ని క‌లిసిన లీడ‌ర్లు.. విష‌యం వివ‌రించాం అంటున్నారు.యాక్చువ‌ల్ గా అయితే.. పంచాయితీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన గ‌ప్ చుప్ గానే ఉంటుంది అనుకున్నారు. ఆ పార్టీకి ఏపీలో కేడ‌రూ లేదు.. లీడ‌ర్లూ లేరు అనేది అంద‌రి వ‌ర్ష‌న్. కానీ.. ఉనికి కాపాడుకునే విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఇప్పుడు ఏపీలో.. పంచాయితీ ఎన్నిక‌ల హీట్ ఉంది క‌దా. ఆ హీట్ మొత్తం ఏక‌గ్రీవాల‌పైనే న‌డుస్తోంది. బెదిరింపుల‌కి దిగుతూ.. ఏక గ్రీవాలు చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారని.. వైసీపీ పై అన్ని పార్టీలూ సీరియ‌స్ గానే ఉన్నాయి. ప్ర‌స్తుతం వైసీపీ అధికారంలో ఉంది. సో.. ఆ పార్టీ ఆడింది ఆట‌గా.. పాడింది పాట‌గా న‌డిపించాల‌ని చూస్తున్నారని.. ప్ర‌తి ప‌క్షాలు సీర‌యస్ గానే ఉన్నాయి. ఇదే విష‌యంపై ఎన్నిక‌ల క‌మిష‌న్ కూడా బానే ఫోక‌స్ చేసింది. ఏక‌గ్రీవాలు అయితే ఓకే కానీ.. బ‌ల‌వంతంగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటున్నారు అధికారులు.ఇక జ‌న‌సేన కామ్ గానే క‌నిపిస్తున్నా.. ఎల మీదికి వ‌చ్చేసింది. బ‌రిలో దిగుతున్నాం.. అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటోంది జ‌న‌సేన‌. ముఖ్యంగా గ్రామ వాలంటీర్ల‌పై కంప్లైంట్స్ చేస్తోంది జ‌న‌సేన‌. ఏపీలో వైసీపీ ఎలా ఉన్నా.. వైసీపీ స‌పోర్ట‌ర్స్ గా క‌నిపించే గ్రామ వాలంటీర్లు మాత్రం బ‌లంగా ఉన్నారు. అన్ని ఊర్ల‌లోనూ వాలంటీర్లు ఉండ‌డంతో.. వారితో ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌స‌రాలు ఉంటాయి. అదే అదునుగా చూసుకుని.. వాలంటీర్లు ఏక‌గ్రీవాల‌పై బెదిరింపులు చేస్తున్నార‌నేది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. ప్రస్తుతానికి అయితే.. వాలంటీర్ల‌కి ఎలాంటి ప‌వ‌ర్సూ లేకుండా చేసింది ఎన్నిక‌ల క‌మిష‌న్. కానీ.. ఊళ్ల‌ల్లో మాత్రం వాళ్ల ప్ర‌భావం బానే ఉంటుంది. అందుకే.. దీనిపై సీరియస్ గా ఫోక‌స్ చేయాల‌ని.. ఎన్నిక‌లు స‌జావుగా.. చ‌ట్ట‌బ‌ద్ధంగా జ‌రిగేలా చూడాల‌ని.. జ‌న‌సేన‌తో పాటు ప్ర‌తి ప‌క్షాలు అన్నీ డిమాండ్ చేస్తున్నాయి.

Related Posts