YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సర్వేలు సరే... వాస్తవం ఏంటీ

సర్వేలు సరే... వాస్తవం ఏంటీ

చెన్నై, జనవరి 29 
తమిళనాడు ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. అయితే వస్తున్న సర్వేలన్నీ విపక్ష డీఎంకే కు అనుకూలంగా ఉన్నాయి. ఈసారి డీఎంకే ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని తేల్చి చెబుతున్నాయి. తాజాగా ఏబీపీ న్యూస్, సీ ఓటర్ సర్వే సయితం డీఎంకేకే అధికారం దక్కనుందని వెల్లడించింది. గతంలో జరిగిన అన్ని సర్వేలూ డీఎంకేకు అనుకూలంగా చెప్పాయి. గత పార్లమెంటు ఎన్నికల్లోనూ డీఎంకేదే పై చేయి అయింది. ఎటు చూసుకున్నా ప్రస్తుతానికి డీఎంకే కే అధికారానికి దగ్గరగా ఉందన్నది వాస్తవం.రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టి ఉంటే డీఎంకే దారుణంగా దెబ్బతిని ఉండేది. తటస్థ ఓటర్లు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ రజనీ కాంత్ లాక్కుని వెళ్లేవారు. కానీ రజనీకాంత్ పార్టీ పెట్టకపోవడంతో డీఎంకేకు అనుకూలంగా మారనుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఎన్నికలలో డీఎంకే కూటమి 39.4 శాతం ఓట్లను సాధించింది. 98 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 117.అయితే సీ ఓటర్ సర్వే ప్రకారం ఈసారి డీఎంకే కూటమికి 41.1 శాతం ఓట్లు సాధిస్తుందని, 162 సీట్లు గెలచుకుంటుందని తెలిపింది. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యయ్ పార్టీకి ఈ ఎన్నికల్లో పెద్దగా ఆదరణ లభించదని సర్వేలో తేలింది. కేవలం నాలుగు స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే కేవలం 98 స్థానాలకు పరిమితమవుతుందని పేర్కొంది.కానీ ఈ సర్వే ఫలితాలు క్షేత్రస్థాయిలో మాత్రం కన్పించడం లేదు. నిజానికి కమల్ హాసన్ పార్టీ బాగా ప్రభావం చూపే అవకాశాలున్నాయంటున్నారు. అలాగే శశికళకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలున్నాయని లెక్కలు వేస్తున్నారు. మరో వైపు ఆళగిరి కూడా డీఎంకేకు ఇబ్బందిగా మారనున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సర్వే ఫలితాలు వాస్తవ ఫలితాలు అయ్యే అవకాశాలు లేవంటున్నారు. అయితే ఈ సర్వేలు డీఎంకే కు ఊపిరి పోస్తున్నాయనే చెప్పాలి. 

Related Posts