YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రాములమ్మకు కలిసి రాని కాలం

రాములమ్మకు కలిసి రాని కాలం

హైదరాబాద్, జనవరి 29, 
తెలంగాణ‌లో రాముల‌మ్మ అంటే ఓ ఫైర్ బ్రాండ్. క‌ర్త‌వ్యం విజ‌య‌శాంతి అంటే.. అంత‌కు మించిన ఫైర్ బ్రాండ్. మ‌రి విజ‌య‌శాంతి అంటే హీరోయిన్నే కాదు. హీరోకి మించి అనొచ్చు. ఒకానొక టైంలో త‌ను ఉంటే చాలు.. సినిమా హిట్ అయ్యేది.. మేల్ కంటే నేనే మేలు అనే భ‌రోసా ఇచ్చిన న‌టి త‌ను. అదే టైంలో.. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు విజ‌య‌శాంతి. విజ‌య‌శాంతి హ‌వా ఆ రోజుల్లో ఎలా ఉందో ఆలోచించుకోండి. వాజ్ పేయి, అద్వానీతో క‌లిసి కూర్చున్నారంటే.. మామూలు మ్యాట‌రా. 24 ఏళ్ల కిందట్నే ఆ రేంజ్ ఉంది. కాక‌పోతే.. ఇప్ప‌డు మాత్రం ఆరేంజ్ కి ఈ రేంజ్ కిందికే ఉంది. అద‌లా వ‌దిలేద్దాం. బ‌ట్.. త‌ను మాత్రం.. ఈ 24 ఏళ్ల‌లో పాలిటిక్స్ ని కాచి వ‌డ పోశారు కావ‌చ్చు. ఎన్నో డ‌క్కా మొక్కీలు తిని.. ఇంత దాకా వ‌చ్చారు. కానీ.. త‌ను అంటే మాత్రం.. దేశ వ్యాప్తంగా ఓ నేమ్ ఉంది. రాముల‌మ్మ అంటే ఓ శ్త్రీ శ‌క్తి అని.. ఆ విష‌యం త‌న‌కి తానుగా కూడా బాగా న‌మ్ముతార‌ని జ‌నం న‌మ్మ‌కం. ఇక ఆమె పొలిటిక‌ల్ జ‌ర్నీ విషాయానికొస్తే మాత్రం.. ఎక్క‌డ మొద‌లెట్టారో అక్క‌డే మొద‌లెట్టారు. కెరీర్ హై స్వింగ్ లో ఉన్న‌ప్పుడు పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన రాముల‌మ్మ‌.. త‌ర్వాత త‌ల్లి తెలంగాణ అని పార్టీ పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. వాయిస్ వినిపించారు. త‌ర్వాత త‌ర్వాత‌.. టీఆర్ఎస్ లో క‌లిశారు. టీఆర్ఎస్ పార్టీతో క‌లిసి.. తెలంగాణ సాధ‌న కోసం ఎంతో శ్ర‌మించారు రాముల‌మ్మ‌.. త‌న మాట‌ల‌తో తెలంగాణ వాయిస్ దేశం మొత్తానికి వినిపించేలా చేశారు. కానీ.. కొన్నాళ్ల‌కి టీఆర్ఎస్ తో పొస‌గ‌లేదు. అందుకే.. కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ లో కూడా బానే ఉంది పొలిటిక‌ల్ కెరీర్. అలా ఎత్తుప‌ల్లాల మీద కెరీర్ అడుగులో అడుగులు వేస్తున్న టైంలో.. మ‌ళ్లీ సొంతింటికి వెళ్లిపోయారు. ఇవ‌న్నీ కాదు.. బీజేపీనే క‌రెక్ట్ అనుకున్నారు కావ‌చ్చు. 23 ఏళ్లు నిండి 24 ఏళ్లు వ‌చ్చే టైంకి.. మ‌ళ్లీ బీజేపీలోకే వెళ్లారు కావ‌చ్చు.పొలిటిక‌ల్ ఎన్నో మిస్టేక్ లు చేస్తుంటాం.. ఒక్కోసారి రాత్రికి రాత్రే.. ఫుల్ పాపులారిటీ వ‌చ్చేస్తోంది. జ‌నంలో ఫుల్ ఫాలోయింగ్ వ‌చ్చేస్తుంది. కానీ.. రాముల‌మ్మ‌కి మాత్రం ఏ పార్టీలోనూ పెద్ద‌గా క‌లిసి రాలేదు అనొచ్చేమో. అప్ప‌టి నుంచి కానీ.. ఇప్ప‌టి దాకా అదే బీజేపీలో ఉండి ఉంటే.. సెంట్ర‌ల్ చ‌క్రం తిప్పే పొజిష‌న్ లో ఉండే వారేమో.. మోడీ లాంటి వారు కూడా.. విజ‌య‌శాంతి స‌ల‌హాలు తీసుకునేవారేమో. ఏమోలే.. మొత్తానికైతే.. ఆమె కెరీర్ మ‌ళ్లీ అక్క‌డికే చేరింది. ఇక‌పై ఎలా ఉంటుందో చూద్దాం.

Related Posts