YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

*కో రి క*

*కో  రి  క*

*నాకే కోరికలూ...లేవు.మిమ్మల్ని కోరికలు లేనివారుగా తయారు చేయాలనేది తప్ప*
*...భగవాన్ శ్రీ సత్య సాయి.*
ఇది అర్థం చేసుకున్నవాళ్ళు దేవుని దరిదాపుల్లోకి వెళ్ళడానికి కూడా భయపడతారనుకంటా. భగవంతుణ్ణి మనం ఎన్నెన్నో కోరుతాం. అత్యవసరాలు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. అవసరాలు,అనవసరాలు అడగాలా వద్దా అనేది మన ఎంపిక.  అవసరాలు, అనవసరాలే కోరికలు అనొచ్చేమో. ఒకసారి శిరిడీబాబా దగ్గర ఒక ప్రధాన శిష్యుడు బాబాను కలవడానికొచ్చిన ఒకతణ్ని ఆపి *నీ కోరికలు చెప్పుకోవడానికే అయితే నీవు బాబాను కలవక్కర లేదు అంటాడు.* దానికి బాబా వెంటనే స్పందిస్తూ...*”నీవు  అంత కఠినంగా ఉండొద్దు. మొదట్లో నీవు కూడా నా దగ్గరకు కోరికలతో వచ్చిన వాడివే, మరిచావా, రానివ్వు అతన్ని”* అన్నాడు. *భగవాన్ శ్రీసత్యసాయి మీద  చాలా మంది కోరికలకోసమే ఆధారపడతారు. ‘స్వామీ...నా కోర్కెల సౌధాన్ని కూల్చి నాకు శాంతినివ్వు’ అని అడిగే ధైర్యం కావాలి.* శ్రీ బీ.వీ. పట్టాభిరాం పుట్టపర్తికి స్వామి దర్శనానికి వెళ్ళాడు. దాదాపు మూడు రోజులు స్వామి పట్టాభిరాం గారికి ఎక్కువ టైం కేటాయిస్తూ...మిగతా వారికి టైం ఇచ్చే అవకాశం తగ్గింది. అలా కొన్ని రోజులుగా స్వామి పెద్దబొట్టు, ఇంకా ఇతరులకు టైం ఇచ్చే అవకాశం తగ్గింది. ఇది నచ్చని శ్రీమతి పెద్దబొట్టు గారు(శ్రీమతి గాలి శారదాదేవి-- షిరిడీ బాబా, సత్య సాయి బాబా రెండు అవతారాల దగ్గర సేవ చేసి తరించిన ఒకే ఒక వ్యక్తి. ఈమె  స్వామి తల్లికంటే పెద్దది. షిరిడీ బాబా తన చివరిరోజుల్లో తాను తిరిగి శ్రీ సత్యసాయిబాబా గా అవతరించినప్పుడు తన జీవిత లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు) స్వామి పిల్లవాడు, ఈమె చాలా పెద్దది. స్వామి దగ్గర చనువు ఉంది. ఒకరోజు ఇక స్వామికి అడ్డుపడి, *”ఏం స్వామీ...మా వైపు కనీసం చూడనైనా చూడకుండా నిన్న గాక మొన్న  వచ్చిన ఈ పిల్లవాన్ని వెంటేసుకొని తిరుగుతున్నావ్, ఇదేం బాగోలేదు. మేం మీ కోసం  తపిస్తుంటే మీరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు” అని చాలా ధైర్యంగా, చనువుగా భగవంతుడు కదా అన్న విషయం మరిచి మాట్లాడింది* అప్పుడు స్వామి ఇలా అన్నారు....  చూడు పెద్దబొట్టూ..! నిన్ను చిత్రావతిలో దూకమంటాను, దూకుతావా?* అన్నారు. *ఓ...ఎందుకు దూకను, తప్పక దూకుతాను, అందులో అనుమనమే లేదు* అన్నది. *”మరి వాణ్ణి కూడా నేను అలా తయారు చేసుకోవాలి  కదా!”* అన్నారు స్వామి. భగవంతుడు మనుషులను దారిలో పెట్టడానికి టైం ఇస్తాడు. భగవంతుడు మొదట్లో మన ఖచ్చితమైన భౌతిక అవసరాలు తీరుస్తాడు. ఇక తదుపరి జ్ఞానపరమైన ఆధ్యాత్మికత లోనికి లాగుతాడు. అంటే భౌతికత వదిలిపెట్టడానికి కాదు. భౌతిక జీవితంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోడించి జీవితాన్ని అర్థవంతం గావించుకోవడానికి దైవం ఎంతో శ్రమకు ఓర్చి మనలను *కోరికల ఊబిలో నుండి* లాగి బయట పడేస్తారు. మనం కోరికలను, ఆశలను, భౌతికాన్ని, జీవితం మీద ఇష్టాన్ని అంత ఈజీగా వదిలేస్తామా. వదలం. అప్పుడు ఇక భగవంతుడు వచ్చి మన జీవిత సౌధాలను (కోరికలను)కూల్చి లాక్కెళతాడు. దీనికి శ్రీరామకృష్ణ పరమహంస గురుదేవులు ఒక చక్కని ఉదాహరణ ఇస్తారు. *పిల్లలు సాయంత్రమై చీకటి పడుతున్నా కూడా ఇంకా ఇంటికి రాక ఆడుతుంటే....తల్లి ఇంట్లోకి రమ్మని కూత పెడుతుంది. కానీ పిల్లలు ఆటలో పడి రారు. ఇక చూసి... చూసి... విసుగెత్తిన తండ్రి  విస  విసా బయలుదేరి కట్టుకున్న పిచ్చుక గూళ్ళను తన్ని, చిందర వందర చేసి పిల్లలను చేతులు పట్టి లాక్కెళతాడు*. ఆ రీతిగా మనం తన్నిచ్చుకోకుండా అంటే రోగాల ఉచ్చులో, కోరికల ఉచ్చులో, మాయ/అజ్ఞత ఉచ్చులో, పునర్జన్మ ఉచ్చులో పడకుండా తెలివిగా జీవితం అనే సంసారాన్ని *తామరాకు మీద @నీటి బొట్టు@  లాగా జీవించాలనేది సత్యం, సత్యం, సత్యం, పరమసత్యం*
లోకా సమస్తా సుఖినోభవన్తు!
హర హర మహాదేవ 

Related Posts