మాజీ కౌన్సిలర్ పులి స్వామి హత్య కేసు నిందితులను అదుపులోకి తీసుకోని జనగామ పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. మృతుడు పులి స్వామి కి, నిందితుల కుటుంబ సభ్యుల మధ్య గత 25 సంవత్సరాలుగా భూవివాదం నడుస్తున్న నేపధ్యంలో ఇరువురు సివిల్ కోర్టు ను ఆశ్రయించారు. తరవాత కొంతకాలానికి గడ్డం నరసింహ చనిపోగా అతని కుటుంబసబభ్యులతో విహదం నడుస్తుంది. ఐతే బుధవారం నాడు సివిల్ కోర్టు లో మృతుడికి అనుకూలంగా తీర్పు రావడంతో తమ తాత ఆస్తి తమకు దక్కకుండా చేస్తున్నాడని జనగామ పట్టణానికి చెందిన గడ్డం నిఖిల్, గడ్డం ప్రవీణ్ లు భావించారు. పులి స్వామి పై కక్ష కట్టి పథకం ప్రకారమే ఉదయం 7 గంటలకు జనగామ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ దగ్గర వాకింగ్ చేస్తున్న పులి స్వామి పై గొడ్డలితో దాడి చేసి అతికిరాతకంగా హత్య చేసి చంపారని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. భూవివాదం సమస్యలు ఉంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దని,ఒకవేళ ఇలాంటి ఘటనలకు పాలుపడితె కఠిన శిక్షలు విదిస్తామని హెచ్చరించారు.