కోవిద్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు .నెల్లూరు ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్ లో జరుగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించి, ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ అమలు తీరును పరిశీలించారు.అక్కడ విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. వ్యాక్సినేషన్ కు సంబంధించి, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సంబంధిత వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.