రాష్ట్రంలో జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలు ఎన్వోసీల మీద సీఎం జగన్ ఫొటోను తొలగించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ కు లేఖ రాశారు.. అభ్యర్థులకు తహసీల్దార్లు జారీ చేసే కుల ధృవీకరణ పత్రాలు ఎన్వోసీలపై జగన్ ఫొటో ఉండడం ఎన్నికల నియామవళికి విరుద్ధమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గవర్నర్ సూచనలు గత అనుభవాల దృష్ట్యా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ సీఎస్కు లేఖ రాసినట్లు సమాచారం. గురువారం జనసేన బీజేపీ నేతలు గురువారం గవర్నర్ను కలిశారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. నామినేషన్ల పరిశీలనలో అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించే అవకాశముందన్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని ఆరోపించారు.