చిత్తూరు డివిజన్ పరిధిలోని 20 మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలైంది చిత్తూరు నగరంలో ఎంపిడిఓ తాసిల్దార్ ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయలలోని నామినేషన్ కేంద్రాలను ఆర్డిఓ రేణుక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ
మాట్లాడుతూ అన్ని నామినేషన్ కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ స్వీకరించడానికి ఏర్పాట్లు పగడ్బందీగా ఉందన్నారు. నేటి నుండి 31 వరకు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు
దాఖలు చేయవచని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఫిబ్రవరి 4వ తేదీన ఉప సంహరణ ఉంటుందని 9వ తేదీ న ప్రశాంత
వాతావరణంలో ఎన్నికలు నిర్వహణ జరుగుతుందన్నారు.