స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని 15 మంది సభ్యులతో రాష్ట్ర ఎన్నికల కమిటీని టీడీపీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. ఏడుగురు సభ్యులతో సమన్వయ కమిటీ, ముగ్గురు సభ్యులతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 25 పార్లమెంటు నియోజకవర్గాలను ఐదు జోన్లుగా విభజించి ఒక్కో జోన్ కు ఇద్దరు నాయకులకు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలు, మండల స్థాయి నేతలతో సమన్వయ బాధ్యతలు అందించడమైనది. టీడీపీ శ్రేణులకు, ప్రజలకు స్థానికి ఎన్నికలకు సంబంధించి న్యాయ సలహాలు, సహకారం అందించేందుకు పది మంది సభ్యులతో లీగల్ సెల్ ఏర్పాటు చేశాం. 24 గంటలూ వారు అందుబాటులో ఉంటారు.
రాష్ట్ర ఎన్నికల కమిటీ :
కింజరాపు అచ్చెన్నాయుడు, యనమల రామక ష్ణుడు, నారా లోకేష్, వర్ల రామయ్య, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎన్.ఎమ్.డి ఫరూక్, డోలా బాల వీరాంజనేయస్వామి, బీదా రవిచంద్ర, బోండా ఉమామహేశ్వరరావు, ఎక్స్ అఫిషియో సభ్యులుగా టి.డి.జనార్థన్, పి.అశోక్ బాబు, గురజాల మాల్యాద్రి, మద్దిపాటి వెంకటరాజు లు వుంటారు.
ఎన్నికల సమన్వయ కమిటీ సభ్యులుగా కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్, టి.డి జనార్థన్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గన్ని క ష్ణ, మద్ది పాటి వెంకటరాజు, చింతకాయల విజయ్ వుంటారు.
ఇదే విధంగా పార్లమెంటు నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గం, మండల స్థాయిలో సమన్వయకర్తలు, న్యాయ సలహాదారులు ఎన్నికల సమయంలో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు.