YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

ఓటుకు నోటు'కేసులో రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

ఓటుకు నోటు'కేసులో రేవంత్ రెడ్డికి ఏసీబీ కోర్టులో చుక్కెదురు

ఓటుకు నోటు' కేసు ప్రస్తుతం ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది.తాజాగా ఏసీబీ కోర్టులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఓటుకు నోటు కేసు ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందని.. ఏసీబీకి సంబంధం లేదని పేర్కొంటూ రేవంత్ రెడ్డి గతంలో ఏసీబీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.ఏసీబీ కోర్టు తాజాగా రేవంత్ రెడ్డి పిటీషన్ ను కొట్టివేసింది. ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వస్తుందని స్పష్టంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి పిటీషన్ ను కోర్టు తిరస్కరించింది.ఈ కేసులో అభియోగాల నమోదు కోసం విచారణను ఫిబ్రవరి 8కి కోర్టు వాయిదా వేసింది. నిందితులందరూ ఫిబ్రవరి 8న ఖచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలను 'ఓటుకు నోటు' కేసు అప్పట్లో షేక్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసేందుకు రూ.50లక్షలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు ఇస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 'చంద్రబాబు' వాయిస్ కూడా అప్పట్లో వైరల్ అయ్యింది. చంద్రబాబు ప్రమేయంపై ఆరోపణలున్నాయి.

Related Posts