నెల్లూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, పార్టీని బలోపేతం చేయాలని జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి స్వాతి పిలుపునిచ్చారు. నెల్లూరు ఇందిరా భవన్ లో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది .ఈ సమావేశానికి ముఖ్య అతిదులుగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవకుమర్ రెడ్డీ , జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శి స్వాతి మాలాగి పాల్గొన్నారు. దెవకుమర్ రెడ్డీ మాట్లా డుతూ యువజన కాంగ్రెస్ విభాగం, పార్టీ కి వెన్నెముక వంటిది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ పరిపాలనలో ప్రజలు అంటే అన్ని మతస్థులు కలిసి బ్రతుకుతున్నారు. నెహ్రూ గాంధీ ల కుటుంబం, త్యాగాల కుటుంబం మహాత్మా గాంధీ,ఇందిరా గాంధీ,రాజీవ్ గాంధీ దేశం కోసమే వారు త్యాగం చేశారు.కావున అందరు యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని కొరినారు.స్వాతి మాళాగి మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి యువజన కాంగ్రెస్ ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు.మండల స్థాయి కమిటీ నియోజకవర్గ స్థాయి కమిటీ బలోపేతం చేస్తే కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది .ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి లోహిత ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేష్,జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ బాబు,ఏటూరు శ్రీనివాసులురెడ్డి, బాల సుధాకర్,బాల కృష్ణ,అల్లుద్దిన్ ,రహ్మాన్,ఆరవ మోహన్,మోహన్ రెడ్డి,హుస్సేన్ భాష,రాజేష్ రెడ్డీ, షజిధ్, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.