విశాఖపట్నం జిల్లా అనకాపల్లి డివిజన్ లో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనకాపల్లి,మాడుగుల, చోడవరం,యలమంచిలి 4 నియోజకవర్గాలు పరిధిలో తొలివిడత పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా తొలివిడతలో 12 మండలాలు పరిధిలో ఎన్నికలు వుంటాయి. అనకాపల్లి,కశింకోట,మునగపాక, అచ్యుతాపురం,చీడికాడ, దేవరపల్లి, కె.కోటపాడు, వి.మాడుగుల, బుచ్చియ్యపేట, చోడవరం,రాంబిల్లి, యలమంచిలి మండలాలు మొత్తం 340 గ్రామాల్లో 3250 వార్డుల్లో తొలివిడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండగా, హైకోర్టు లో కేసులు కారణంగా రాంబిల్లి మండలం 4 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. పంచదార్ల, అప్పారాయుడు పాలెం, జెడ్.చింతువా, ఎం.చింతువా గ్రామ పంచాయితీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. శుక్రవారం ఈరోజు ఉదయం 10.30గంటలు నుంచి తొలివిడత పంచాయితీ ఎన్నికల గ్రామాల్లో నామినేషన్లు స్వీకరణ ప్రారంభమయింది. అనకాపల్లి డివిజన్ పరిధిలోని పోలింగ్ సిబ్బందికి నిన్న ఎన్నికల శిక్షణ పూర్తయింది. తొలివిడత లో 10వేల మంది ఎన్నికల సిబ్బంది సిద్ధం అయ్యారు. అనకాపల్లి డివిజన్ పరిధిలో 78 అత్యంత సమస్యాత్మక పంచాయితీలు, 104 సమస్యాత్మక పంచాయితీలు గా గుర్తించినట్లు విశాఖ రూరల్ ఎస్పీ బి.కృష్ణారావు వెల్లడించారు. రౌడీ షీటర్లు ను బైన్డ్ ఓవర్ చేస్తున్నారు. గన్ లైసెన్స్ కలిగిన వారి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.