నెల్లూరు జిల్లాలో జరుగుతున్న మెదటి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ కు అధికారులు సర్వం సిద్ధం చేశారు.కావలి డివిజన్ లోని 9 మండలాల్లో 163 పంచాయతీలకు 1566 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్లు మెదటి రోజు కావటంతో నామినేషన్లు దాఖలు చేయటానికి అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. అయితే ఈరోజు శుక్రవారం పాడ్యమి కావటంతో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు వెనుకడుగు వేస్తున్నారు. అయితే కావలి నియెజకవర్గంలోని నాలుగు మండలాలో నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్ధలకు గ్రామ సచివాలయాలలో అధికారులు వేచి చూస్తున్నారు.