YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ సంబరాలు

టీడీపీ సంబరాలు

రామతీర్థం దేవస్థానం సహా మూడు దేవస్థానాల అనువంశిక ధర్మకర్త పదవి నుంచి అశోక్ గజపతిరాజు ను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హై కోర్ట్ రద్దు చేయడాన్ని హర్షిస్తూ విజయనగరంలో టీడీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారికి 108 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.వైసిపి ప్రభుత్వ తీరుపై హైకోర్టు వరుసగా మొట్టికాయలు పెట్టినా బుద్ధి రావడంలేదని,ఇప్పటికైనా వైసిపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలంటూ దేవుణ్ణి కోరుకుంటున్నామని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Related Posts