పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ దశాబ్ధానికే ఇది తొలి బడ్జెట్ అని.. ఈరోజు మొదటి సెషన్ అని.. దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో కీలకమని ప్రధాని మోడీ అన్నారు.న స్వాతంత్య్ర సమరయోధుల కలలను సాకారం చేయడానికి ఎంతో మంచి అవకాశాలు వస్తున్నాయని.. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. భారతదేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది ఆర్థికమంత్రి ప్యాకేజీల రూపంలో నాలుగైదు మినీ బడ్జెట్ లు ప్రవేశపెట్టినట్టు తెలిపారు.కరోనా కారణంగా కేంద్రప్రభుత్వం దాదాపు 30 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మల ఇప్పటికే పలుమార్లు ప్యాకేజీని ప్రకటించారు. దీనిని మోడీ గుర్తు చేస్తూ 2020లో మినీ బడ్జెట్ లు ప్రవేశపెట్టామన్నారు.తాజాగా ఫిబ్రవరి 1న 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ను కేంద్రమంత్రి నిర్మల ప్రవేశపెట్టబోతున్నారని మోడీ తెలిపారు. ఈ శతాబ్ధానికి కూడా ఇదే తొలి సమావేశం అన్నారు. భారత్ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.