YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం దేశీయం

13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే

13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే

ఏపీలో స్థానిక ఎన్నికల హడావిడి మాములుగా లేదు. నేటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడం తో రాష్ట్రమంతా హడావిడి కనిపిస్తుంది. ఈ సమయంలో ఏపీ సీఎం జగన్ సొంత జిల్లా అయిన కడప జిల్లాలో 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలకు బ్రేక్ పడింది. కడప జిల్లాలోని 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంతో ప్రస్తుతానికి అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి.ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే విధించింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. సంబేపల్లె మండలంలో మూడు పంచాయతీలు వల్లూరు మండలంలో 2 రైల్వేకోడూరులో 2 నందలూరులో ఒకటి టి.సుండుపల్లెలో 2 పుల్లంపేటలో 2 కమలాపురం మండలంలో ఒక పంచాయతీపై హైకోర్టు స్టే విధించడంతో అక్కడ ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు ఆగిపోయాయి.
ఇదిలావుంటే కడప జిల్లాలో నేడు మూడు నియోజకవర్గాల్లోని 206 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు ప్రారంభం అవుతున్నాయి. ఇవాళ్టి నుంచి తొలివిడతలో ప్రొద్దుటూరు మైదుకూరు బద్వేల్ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బరిలో ఉన్న అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేయనున్నారు
 

Related Posts