షర్మిల పార్టీ.. బ్యాక్ గ్రౌండ్... ఇదేనా
హైదరాబాద్, జనవరి 30,
షర్మిల కొత్త పార్టీ.. ఇది కొత్త పాయింటే. జనంలో ఇప్పుడు ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. నిజమేనేమో అనే డౌట్ కూడా వస్తోంది. కాకపోతే ఇది ఇంకా పాపులర్ కాలేదు. కానీ.. ఈ లెక్కన చూస్తే మాత్రం.. పొలిటికల్ అనలిస్టులు కూడా ఎస్ ఎగ్జాక్ట్ లీ అంటున్నారు. ఇందులో తప్పేం ఉంది.. ఇది కూడా రాజకీయ తంత్రమే కదా అనుకుంటున్నారు. చూస్తుంటే.. సీఎం కేసీఆర్.. సీఎం జగన్ కలిసి.. తెలంగాణలో షర్మిలతో పార్టీ పెట్టిస్తే.. అంతా ప్రశాంతం అనుకుంటున్నారట. అవును.. రాజకీయంగా ఎవరి లెక్కలు వారికి ఉంటయ్. షర్మిల పార్టీ విషయంలో కూడా ఎవరి లెక్కలు వారివే.. షర్మిల పార్టీ పెడితే.. తనకీ ఓ బలం ఉంటుంది. తనూ ఇండివిడ్యువల్ పొలిటికల్ పార్టీ అధినేత అవుతారు. లీడర్ లా కాకుండా.. పార్టీని నడిపించే నాయకురాలు అవుతారు. సో.. అన్నకు ఓకే. చెల్లికి పదవి ఇవ్వలేదు అని చాలా వార్తలు వచ్చాయి. కావాలనే దూరం పెట్టారు జగన్ అనే వార్తలు కూడా వచ్చాయి. అవి అలా వదిలేద్దాం. కానీ.. షర్మిలకు తెలంగాణలో జగన్ సపోర్ట్ చేస్తే వచ్చే ప్రాబ్లమ్ ఏమీ లేదు. తెలంగాణలో జగన్ బలం పెరుగుతుంది తప్ప.. వచ్చే నష్టం ఏమీ లేదు. షర్మిల సక్సెస్ అవుతారా లేదా అన్నది వదిలేస్తే.. ఏమో.. ట్రయల్ వేస్తే తప్పేంటి అనేది ఇంట్రస్టింగ్ పాయింటే కదా. పైగా చెల్లిని పార్టీ అధినేతను చేసి.. బలంగా నిలబెట్టడానికి ఎంతో కష్ట పడ్డ అన్నగా హిస్టరీలో రికార్డ్ ఉంటుంది కూడా.ఇక కేసీఆర్ లెక్కలు కూడా బానే ఉన్నయ్. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినా ఒక సామాజిక వర్గం నుంచి మాత్రమే.. ఆమెకు బలం పెరుగుతుంది. రెడ్డి సమాజిక వర్గానికి ఇప్పటికీ వైఎస్ పైనా.. జగన్ పై ప్రేమ ఉంది. వైసీపీ ఇక్కడ లేకపాయెనే అనే ఫీలింగ్ ఉంది. వాళ్లంతా కాంగ్రెస్ లో ఉంటున్నారు. పోతే.. వాళ్లు షర్మిల పార్టీలోకి పోతారు. లేదంటే.. బీజేపీలోకి వలసలు పెరిగే టైం.. అటు నుంచి కట్టడి వేయొచ్చు. బీజేపీలోకి వెళ్లాల్సిన వాళ్లకి షర్మిలా ఒక ఆప్షన్ అవుతుంది. వాళ్లలో కొంతమంది అటు పోయినా.. మెజార్టీ వర్గం మాత్రం ఇటే వెళ్తుంది. ఎందుకంటే.. అసలు బీజేపీ అనే పార్టీకానీ.. ఆ లీడర్లు కానీ.. జనంతో కనెక్ట్ అయిన వాళ్లు కాదు. మాస్ లీడర్లు లేరు. వాళ్లేదో దేవుళ్లు హిందువుల అంటారు అనే ఫీలింగ్ ఉంది. బీసీలు, సామాజిక వర్గాలు అనేలా మాస్ ఫాలోయింగ్ తెచ్చుకోలేదు బీజేపీ. సో.. బీజేపీ అంటే.. అది ఎక్కడి పార్టీనోలే అన్న ఫీలింగ్ ఉంటుంది. సో.. షర్మిల పార్టీ జెండా ఎత్తుకునే అవకాశం నూటికి తొంబై శాతం ఉంది. మరి షర్మిల పార్టీని జగన్ ఎంకరేజ్ చేస్తున్నాడు అంటే అర్దం ఉంది. చెల్లి కాబట్టి.. ఆ మాత్రం చేస్తాడు కావచ్చు. అందులో కూడా రాజకీయ కోణం ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు కలిసే ఉంటయ్ కాబట్టి.. తెలంగాణలో కూడా జగన్ కి బలం అవసరమే. మరి.. కేసీఆర్ కి అవసరం ఏంటి.. షర్మిలాతో సీఎం కేసీఆర్ కీ.. టీఆర్ఎస్ కీ ప్రాబ్లమ్ లేదా అన్నది ఇంకో పాయింట్. అయితే.. షర్మిల పార్టీ తెలంగాణలో వచ్చినా.. ఓ పదేళ్ల పాటు అధికారంలోకి రావడం అయితే ఇంపాజిబుల్. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ పార్టీ ఇంకా బలంగానే ఉంది. అటు బీజేపీ కొంత చీల్చుకుంటుంది.సో.. షర్మిల పార్టీ ఒక పార్టీగా ఉంటుంది. వీలైనన్ని ఎమ్మెల్యే పదవుల్ని గెలిపించుకుంటుంది. కానీ... జగన్ తో షర్మిలతో సీఎం కేసీఆర్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. సో.. మిత్ర పక్షంగా ఉండి పోతుంది. అటు ఎంఐఎం కీ.. జగన్ ఫ్యామిలీకి కూడా పెద్దగా విభేదాలేం లేవు.. సో.. ఇటు ఎంఐఎంనీ.. షర్మిల పార్టీని కలుపుకుని పోతే.. తెలంగాణలో మరో రెండు సార్లు.. టీఆర్ఎస్ పార్టీకి ఎదురేలేదు. సో.. ఎంఐఎం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. షర్మిల పార్టీ వచ్చి సీట్లు గెలుచుకున్నా కూడా.. ఆమె పార్టీ సపోర్ట్ ఉంటుంది. ఇటు కాంగ్రెస్ వాళ్లు.. బీజేపీ వాళ్లు సింగిల్ డిజిట్ లోనే ఉండిపోతారు. టీఆర్ఎస్, ఎంఐఎం, వస్తే షర్మిల పార్టీ కలిసి.. తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంటాయి.. షర్మిలకి కూడా ఎమ్మెల్యేలను బట్టి మినిస్ట్రీలు ఇస్తే.. అంతా సెట్ అవుతుంది. ఇదీ ప్లాన్ కావచ్చు