YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నెల్లూరులో 1222 కోట్ల మద్యం అమ్మకాలు

నెల్లూరులో 1222 కోట్ల మద్యం అమ్మకాలు

ఎవరైనా ఆరోగ్యం కోసమో, విలాసాల కోసమో, ప్యామిలి కోసమో డబ్బులు ఖర్చు చేయడం చూశాము.. కానీ నెల్లూరులో మాత్రం కిక్ కోసం డబ్బులు తగలేస్తున్నారు.. రోజుకు సరాసరి 3.50 కోట్ల లెక్కన తాగేశారు..  గత ఆర్దిక సంవత్సరంలో జిల్లాలో ఒకే వ్యవహారం కోసం చేసిన ఖర్చు మొతం 1222 కోట్ల రూపాయలు.. మద్యం బాబుల గురించి అలా ఉంచితే ఎక్సైజ్ శాఖ మాత్రం  ఈ రాబడిని చూసి పండుగ చేసుకుంటోంది.. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా  2017-18 ఆర్దిక సంవత్సరంలో జిల్లాలో ఏకంగా రూ.1222 కోట్ల మద్యాన్ని మందుబాబులు తాగేశారు.

 అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ దఫా 4.75 శాతం పెరుగుదల కనిపించింది.. 2017 ఏప్రిల్ 1 నుంచి 2018 ఏప్రిల్ 31 వరకు జిల్లాలో 24,34,350 బాక్సుల మధ్యం అమ్మకాలు జరిగాయి.. అదేవిధంగా 14,81,662 బాక్సులబీర్ అమ్మకాలు జరిగాయి.. మొత్తంగా చూస్తే 1222 కోట్ల మద్యం అమ్మకాలు జఃరిగినట్లు ఎక్సైజ్ శాఖాధికారులు చెబుతున్నారు.. 

2016-17 ఆర్దిక సంవత్సరంలో 23,23,979 బాక్సుల మద్యం , 12,66,568 బాక్సుల బీర్ అమ్మకాలు జరిగాయి.. ఈ ఏడాది రూ. 1001 కోట్లు మద్యం అదనంగా జరిగాయి.. దీంతో 2016-17తో పోలిస్తే 2017-2018లో మద్యం బాక్సుల అమ్మకాల్లో 4.78 శాతం పెరుగుదల నమోదవ్వగా, అడిషన్ ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో రెవెన్యూ పరంగా 22 శాతం పెరుగుదల కనిపించింది.. గతేడాది ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకురావడం, హైవేలపై మద్యం దుకాణాలు తొలగించాలంటూ సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో మద్యం అమ్మకాలు ఒక విధంగా తగ్గాయని మద్యం వ్యాపారులంటున్నారు.. సుమారు 10 రోజులు పాటు మద్యం దుకాణాలు ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొనింది.. అదే అప్పుడు కూడా మద్యం దుకాణాలు యథావిధిగా జరిగి ఉంటే ఎక్సైజ్ శాఖకు మరింత ఆదాయం పెరిగి ఉండేదని అంచనా వేస్తున్నారు..

Related Posts