YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

దినకరన్ పార్టీలోకే శశికళ

దినకరన్ పార్టీలోకే శశికళ

చెన్నై. ఫిబ్రవరి 1, 
తమిళనాడు ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. కొత్తగా పుట్టిన పార్టీలు మనుగడ ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. జయలలితకు అత్యంత సన్నిహితమైన కుటుంబాన్ని ఆమె మరణం తర్వాత పార్టీ నుంచి బహిష్కరించారు. శశికళ అక్రమార్జన కేసులో జైలుకు వెళ్లగా, ఆమె మేనల్లుడు దినకరన్ అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం పేరుతో పార్టీని పెట్టారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ గెలవడం తప్ప పార్టీ స్థాపించిన తర్వాత ఒక్క విజయమూ దక్కలేదు.స్థానిక సంస్థల ఎన్నికలలో కొంత ప్రభావం చూపింది. అయితే ఈసారి దినకరన్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే కూటమిలోకి దినకరన్ పార్టీని రానిచ్చే అవకాశం లేదు. డీఎంకే కూటమిలోకి వెళ్లాలంటే అది జయలలిత ఆశయాలకు విరుద్ధం. దీంతో ఒంటరిగానే దినకరన్ పార్టీ పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే దినకరన్ పార్టీ నుంచి అనేక మంది నేతలు డీఎంకేలో చేరిపోయారు.ఉన్న నేతలందరూ కొంత అసంతృప్తితో ఉన్నా అన్నాడీఎంకే లో శశికళ చేరతారన్న ఆశతో ఉన్నారు. దీంతో పాటు దినకరన్ పార్టీలో ఉంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఎన్నికల ఖర్చును పార్టీయే భరిస్తుందని ఇప్పటికే దినకరన్ కొందరికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చు అంటే కోట్లలో ఉంటుంది. శశికళ ఆర్థికంగా బలవంతురాలు కావడంతో ఆమె వైపు ఉండేందుకే పార్టీలో ఇష్టపడుతూ కొనసాగుతున్నారు.శశికళ వచ్చిన తర్వాతనే దీనిపై క్లారిటీ రానుంది. శశికళ నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారు. దినకరన్ మొత్తం పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. 234 నియోజకవర్గాల్లో దినకరన్ పార్టీ పోటీ చేసే శక్తి, సత్తా లేదు. దీంతో దినకరన్ బీజేపీ నేతలతో సమాలోచనలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే అన్నాడీఎంకే ను కాదని బీజేపీ శశికళ పక్కన చేరే అవకాశం లేదు. దీంతో దినకరన్ పార్టీ ఒంటరిగానే పోటీ చేేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శశికళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Related Posts