YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

అర్ధరూపాయి నుంచి 14 కోట్లకు..

అర్ధరూపాయి నుంచి 14 కోట్లకు..

భోపాల్, ఫిబ్రవరి 1, 
కేవలం అర్ధ రూపాయితో మొదలైన వారి వ్యాపారం ప్రస్తుతం రూ. 14 కోట్లకు చేరి మహిళలు సైతం ఏదైనా సాధిస్తారని నిరూపించింది. కేవలం ఐదవ తరగతి చదివిన ఆ మహిళ తెలివికి తోడైన మరింత మంది ప్రోత్సహంతో నేడు వారు ఆదర్శంగా నిలిచారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం దిండోరీ జిల్లా నివాసం ఉండే బార్గా తెగవాసీలు బయట ప్రపంచానికి దూరంగా ఉంటు అటవిలో జీవనం గడుపుతున్నారు. అక్కడే ఉంటున్న చంద్రకాళి అన్నయ్యలు బతుకు భారంగా మారడంతో నగరాల వైపు అడుగులు వేశారు. ఆ తెగలోని వారందరూ చదువుకు దూరమే. వారిలో ఐదవ తరగతి చదివారంటేనే మహా గొప్ప.అయితే.. ఐదవ తరగతి పూర్తయి చంద్రకాళికి చదువు మాన్పించి 11 ఏళ్లకే పెళ్లి పీటల ఎక్కించారు. 19 ఏళ్లకు చంద్ర ఇంట్లో వాళ్లకి చెప్పకుండా ప్రధాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని ఓ పొదుపు సంఘంలో సభ్యురాలిగా చేరింది. సంఘం సమావేశాల్లో చంద్ర తీరు అందరినీ ఆకట్టుకుంది. చంద్రకు కూడా పొదుపు సంఘవ శక్తి ఏంటో పూర్తిగా అర్థమైంది. ఆ తెగ వారు కేవలం వర్షాధార పంటలపైనే ఆధార పడుతారు కాబట్టి, అలా కాకుండా ప్రత్యామ్నాయంగా వచ్చే ఆదాయాలను వెతకసాగింది.తన సంఘం సభ్యురాళ్లను అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది. అయితే ఆ సంఘం సభ్యులంతా మగవాళ్లపైనే ఆధారపడేవారు కాబట్టి వారానికి అర్ధ రూపాయి జమా చేయడం కష్టతరంగా మారింది. మొదటి నెలలో అందరు జమచేయగా కేవలం రూ. 20 మాత్రమే అయ్యాయి. ఆ డబ్బులతోనే వాళ్లు నాటు కోళ్లను పెంచడం ప్రారంభించారు.ఆ నోటా ఈ నోటా ఈ విషయం పక్క ఊరి వారికి తెలువగా వారు సైతం ఈ పొదుపు సంఘంలో చేరారు. రానురాను చంద్ర చూపిస్తున్న చొరవతో ఆ పొదుపు సంఘం పెద్ద కో అపరేటివ్‌ సంస్థగా మారింది. నాడు అర్ధ రూపాయితో మొదలైన కోళ్ల వ్యాపారం నేడు రూ. 14 కోట్లకు చేరింది.ఆగని చంద్ర ఆధ్వర్యంలోని మహిళలు కాయకూరలు, పుట్టగొడుగులు తదితర పంటు పండిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. దీనంతకి కారణమైన చంద్రకాళీ కృషిని గుర్తించిన సీఐఐ ఫౌండేషన్‌ ఆమెకు రూ. 3 లక్షల బహుమతి ప్రకటించింది.

Related Posts