YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మే 7న ఆర్ధిక సంఘ నియమ నిబంధనలపై చర్చ

మే 7న ఆర్ధిక సంఘ నియమ నిబంధనలపై చర్చ

15వ ఆర్థిక సంఘం నియమ నిబంధనలతో రాష్ట్రాలకు జరిగే నష్టంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ పిలుపునిచ్చారు. మే 7వ తేదీన విజయవాడలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో జరిగే సమావేశం అజెండా ఖరారు నిమిత్తం ఆయన సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై స్పందించారు. ఈ సంద‌ర్భంగా వచ్చే నెల‌లో జ‌ర‌గ‌నున్న విజ‌య‌వాడ స‌మావేశానికి ఏపీ, పంజాబ్, ఢిల్లీ ఆర్థిక మంత్రుల‌ను రావాల్సిందిగా కోరారు. ఇదివ‌ర‌కే ఏప్రిల్ 10న తిరువ‌నంత‌పురంలో జ‌రిగే స‌మావేశానికి ఇప్పుడు జ‌ర‌గబోయే స‌మావేశం కొన‌సాగింపు కాగల‌దు.15వ ఆర్థిక సంఘం నిబంధనల వల్ల చాలా రాష్ట్రాలు నష్టపోతాయని థామస్‌ ఇసాక్‌ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకే సుమారు రూ.80వేల కోట్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అందుకే విజయవాడలో జరిగే సమావేశం ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు. 2011 జనాభా లెక్కల్ని ప్రాతిపదికగా తీసుకోవటం వల్ల దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒడిశా, పశ్చిమబంగా లాంటి రాష్ట్రాలకి నష్టం వాటిల్లుతుందని... ఇది మొత్తం సమాఖ్య వ్యవస్థకే దెబ్బ అని అభిప్రాయపడ్డారు. దీనిపై అన్ని రాష్ట్రాలను ఏకం చేసేందుకు సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందువ‌ల్ల 1971 లెక్క‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపులు జ‌ర‌పాల‌ని 15వ ఆర్థిక సంఘానికి ద‌క్షిణాది ఆర్థిక మంత్రులు సూచిస్తున్నారు. తమిళనాడు తప్ప ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాలు సానుకూలంగా స్పందించాయన్నారు. నిధుల్లో వాటా తగ్గినా ప్రోత్సాహకాలు ఇస్తామని తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రధాని తప్పుదారి పట్టించారని ఆరోపించారు. కర్ణాటక ఎన్నికలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై చర్చ జరగాలని... విజయవాడలో జరిగే సదస్సు తర్వాత ప్రజల్లోకి వెళ్లి దీనివల్ల జరిగే నష్టంపై వివరిస్తామని వెల్లడించారు. తొలుత జీఎస్టీ రెవెన్యూలో 60శాతం రాష్ట్రాలకు ఇవ్వాలనే ఆలోచన ఉండేదని.. కానీ దాన్ని 50శాతానికే పరిమితం చేశారని థామస్‌ తప్పుబట్టారు. ఎక్కువ రెవెన్యూ సాధించే రాష్ట్రాల‌కు ఎక్కువ ప‌న్నుల పంపిణీ చేయ‌కుండా, ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించ‌ని రాష్ట్రాల‌కు నిధుల పంపిణీ ఎక్కువ జ‌రుగుతోంద‌ని ఎప్ప‌టి నుంచే ద‌క్షిణాది నాయ‌కులు కేంద్రంపై పెద‌వి విరుస్తున్నారు. 

Related Posts