YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేటీఆర్ సరే.. కవిత సంగతేంటీ...

కేటీఆర్ సరే..  కవిత సంగతేంటీ...

హైదరాబాద్, ఫిబ్రవరి 1, 
తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్ సీఎం అవ్వాల‌నే డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతోంది. టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సీఎం అవ్వాల‌ని చాలా మంది కోర‌స్ పాడుతున్నారు. ఆయా కార్య‌క్ర‌మాల సంద‌ర్బంగా బ‌హిరంగంగానే వేదిక‌ల‌పై కేటీఆర్ ప‌క్క‌నే ఉండ‌గా ఆయ‌నే సీఎం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాటికి కేటీఆర్ కూడా స్పందించ‌క‌పోతుండ‌డంతో ఇక త్వ‌ర‌లోనే ఆయ‌న సీఎం అవుతార‌ని జోరుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మంత్రి కేటీఆర్ సీఎం అవనున్నార‌నే విష‌యం దాదాపుగా స్ప‌ష్ట‌మ‌వుతుండ‌గా.. ఇప్పుడాయ‌న సీఎం అయితే టీఆర్ ఎస్ కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎవ‌రు అవుతారు ? పార్టీ బాధ్య‌త‌ల‌ను ఎవ‌రు చూసుకుంటారు ? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి.కేటీఆర్ సీఎం అయితే ఎమ్మెల్సీ క‌విత‌కు తెరాస వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వ‌స్తుంద‌ని, ఆమె పార్టీ బాధ్య‌త‌ల‌ను చూసుకుంటార‌ని తెలుస్తోంది. మ‌రి.. హ‌రీష్ రావు ప‌రిస్థితి ఏమిటి ? అంటే.. ఆయ‌న‌కు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తార‌ని స‌మాచారం. మ‌రి అప్ప‌టికే అందులో ఉన్న బోయిన్‌ప‌ల్లి వినోద రావు ప‌రిస్థితి ఏమిటి ? అంటే.. ఆయ‌న‌కు కేటీఆర్ త‌న కేబినెట్ మంత్రిగా అవ‌కాశం క‌ల్పిస్తార‌ని తెలుస్తోంది. ఇలా ప్ర‌స్తుతం ఊహాగానాలు కొన‌సాగుతున్నాయి.అయితే పైన చెప్పిన‌ట్లుగానే నిజంగా ప‌ద‌వుల‌న్నింటినీ అలాగే ఇస్తే ప్ర‌తిప‌క్ష పార్టీలు తీవ్ర విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశం కూడా ఉంది. ఇప్ప‌టికే తెరాస కుటుంబ పార్టీ అయింద‌ని, రాష్ట్రంలో కుటుంబ పాల‌న న‌డుస్తుంద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శిస్తూనే ఉన్నాయి. అందువ‌ల్ల త‌మ కుటుంబ స‌భ్యుల‌కే అన్ని ప‌దవులు ఇవ్వాలా, వ‌ద్దా అనే విష‌యంపై సీఎం కేసీఆర్ ఇప్పుడే నిర్ణ‌యం తీసుకోక‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతానికి కేటీఆర్‌ను సీఎంను చేయ‌డం ఒక్క‌టే ప‌ని, మిగిలిన‌వి త‌రువాత చూద్దాం అని కూడా భావించ‌వ‌చ్చు. క‌నుక ఈ విష‌యాల‌పై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజుల పాటు ఆగాల్సిందే.మంత్రి కేటీఆర్ సీఎం అవుతార‌ని గ‌తంలో కొంద‌రు ప్ర‌జా ప్ర‌తినిధులు బ‌హిరంగ వేదిక‌ల‌పై కేటీఆర్ ఎదుటే కామెంట్లు చేశారు. అప్ప‌ట్లో కేటీఆర్ ఆ వ్యాఖ్య‌ల‌ను కొట్టి పారేశారు. కానీ ప్ర‌స్తుతం సీన్ మారింది. సాక్షాత్తూ మంత్రులే కేటీఆర్ సీఎం అయితే త‌ప్పేంటి ? అని వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా కేటీఆర్ ఎదురుగానే. కానీ ఆ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తుతం కేటీఆర్ ఖండించ‌డం లేదు. అంటే.. ఆయ‌న సీఎం అవ‌డం ప‌క్కా.. అని తేలిపోయింది. మ‌రి.. ఆయ‌న సీఎం ఎప్పుడు అవుతారు ? ఒక వేళ ఇప్పుడే సీఎం అయితే.. ఇది అందుకు స‌రైన స‌మ‌య‌మేనా ? అంటే.. అందుకు రాజకీయ వ‌ర్గాల్లో భిన్న‌మైన వాద‌న‌లు వినిపిస్తున్నాయి.మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేస్తూ ఆటోమేటిగ్గా మంత్రివ‌ర్గం ర‌ద్దు అవుతుంది. కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేయాలి. దీంతో కేటీఆర్ త‌న‌కు అనుకూలంగా ఉండే వారికి చాన్స్ ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. అప్పుడు రెబ‌ల్స్ పుట్టుకొస్తారు. వారు సొంత కుంప‌టి పెట్టుకునే ప్ర‌మాదం కూడా ఉంటుంది. అలాంటి క్లిష్ట‌త‌ర‌మైన ప‌రిస్థితిని కేటీఆర్ స‌రిగ్గా హ్యాండిల్ చేయ‌లేరు. క‌నుక ఆయ‌న‌ను ఇప్పుడే సీఎంను చేయ‌డం స‌రికాదు.. అని కొంద‌రు గులాబీ నాయ‌కులు మీడియాతో అంటున్నారు.అయితే మంత్రి కేటీఆర్‌ను సీఎంను చేయ‌డం వ‌ల్ల కేసీఆర్ దేశ రాజ‌కీయాల‌పై దృష్టి పెట్ట‌వ‌చ్చని, దీంతో పార్టీ బ‌లోపేతం అవుతుంద‌ని, ప్ర‌స్తుతం తెరాస ఉన్న ప‌రిస్థితిలో ఇది క‌ల‌సి వ‌స్తుంద‌ని, క‌నుక కేటీఆర్‌ను సీఎంను చేయాల్సిందేన‌ని మ‌రొక వ‌ర్గం వాదిస్తోంది. అయితే ఎంత‌మంది ఎన్ని అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నా సీఎం కేసీఆర్ మ‌న‌స్సులో ఏముందో ఎవ‌రికీ తెలియ‌దు. క‌నుక ఆయ‌న స్వ‌యంగా నిర్ణ‌యం తెలిపేవ‌ర‌కు అంద‌రూ వేచి చూడాల్సిందే.

Related Posts