YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఫైట్

టీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఫైట్

హైదరాబాద్, ఫిబ్రవరవ 1, 
ఏడు కొండ‌ల వాడి అప్పులైనా తీర‌తాయేమో కానీ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లీడ‌ర్ల‌కి మ‌ధ్య మాత్రం పొత్తులు కుద‌ర‌వు. పైకి మాత్రం అంతా ఫ్రెండ్లీగానే ఉన్న‌ట్లు క‌నిపిస్తుంటారు. కానీ.. లోప‌ల లోప‌ల ఏం జ‌రుగుతుందో ఏమో.. ఏ విష‌య‌మైనా తెగ‌దూ ముడి ప‌డ‌దూ. అంద‌రు లీడ‌ర్లూ బ‌య‌టి పార్టీల‌తో పాలిటిక్స్ చేస్తుంటే.. వీళ్లు మాత్రం వాళ్ల పార్టీలోనే వాళ్ల పార్టీ వాళ్ల‌తోనే పాలిటిక్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలోనూ అంతే జ‌రుగుతోంది. పెద్ద ప్రాబ్ల‌మై కూర్చుంది.చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు.. చ‌ర్చ‌ల మీద చ‌ర్చ‌లు చేయ‌డం.. మ‌ళ్లీ వ‌దిలేసి వెళ్లిపోవ‌డం ఇది కాంగ్రెస్ లో మామూలే క‌దా. అందుకే ఇప్పుడు ఓ ఎమ్మెల్సీ సీటు విష‌యం కూడా అంతే ర‌చ్చ అవుతుంది. ఫుల్లు చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌య్. ఒక్క సీటు కోసం భారీ పోటీ ఉండ‌డంతో కూడా ఇష్యూ అలాగే ఉండి పోయింది. మ‌హ‌బూబ్ న‌గ‌ర్, రంగారెడ్డి, హైద‌రాబాద్ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం కాంగ్రెస్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా ప‌ట్ట‌భ‌ద్రులు విభిన్న‌మైన తీర్పు ఇస్తుండ‌డంతో ఈ డిమాండ్ వ‌చ్చింది. అందుకే.. సీనియ‌ర్లు అంతా.. ఎవ‌రికి సీటు ఇవ్వాలి అనే విష‌యంపై ఫుల్ డిస్క‌ష‌న్లు చేస్తున్నారు.ఇప్పుడున్న కాంగ్రెస్ సిచ్చువేష‌న్ డిఫ‌రెంట్ ఒక్క ప‌ద‌వి రావ‌డం అంటే కూడా మామూలు విష‌యం కాదు. ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ప‌డి గెలవాలి. కానీ.. గెలిచిన వారి లెక్కే వేరు. ప‌ద‌వి ఉన్న వాళ్లు త‌క్కువ మంది ఉండ‌డంతో.. స్పెష‌ల్ గా క‌నిపిస్తారు. ఇక తామే ఆశాజ‌న‌కంగా క‌నిపిస్తాం అనే ఇంటెన్ష‌న్ కూడా ఉంది లీడ‌ర్స్ లో. పైగా ప‌ద‌వి లేకుండా ఉండ‌డం అంటే.. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కి మామూలు విష‌యం కాదు. పైగా ఎమ్మెల్సీ ప‌ద‌వి కావ‌డంతో సీనియ‌ర్లు కూడా ఫుల్ ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నార‌ట‌. కాక‌పోతే.. ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక కావ‌డంతో.. ఇంట‌లెక్చువ‌ల్స్ కే ఇంపార్టెన్స్ ఉంటుంది. పార్టీని చూసి కాకుండా.. అభ్య‌ర్థిని చూసే ఓట్లు ప‌డ‌తాయి. అయినా పార్టీని చూసి ఓటేస్తారు అనే పొజిష‌న్ లో లేదు కాంగ్రెస్. ఈ విష‌యం వారికి కూడా తెలుసు. సో.. ఎవ‌రు నిల‌బ‌డాలి. ఎవ‌రు నిల‌బ‌డ‌తాం అంటే.. పై నుంచి రియాక్ష‌న్ ఎలా వ‌స్తుంది అన్న డౌట్ అంద‌రిలోనూ ఉండి పోయింది. అయినా స‌రే.. ప‌ద‌వి కోసం కాస్త ధైర్యం చేద్దాం అని ముందుకెళ్తున్నారు లీడ‌ర్లు. మ‌రి ఈ పంచాయితీ ఎప్పుడు తెగుతుందో ఏమో.

Related Posts