YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం విద్య-ఉపాధి ఆస్తి-పాస్తులు ఆటలు ఆరోగ్యం దేశీయం

వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్

న్యూఢిల్లీ ఫిబ్రవరి 1, 2021-22 వార్షిక బడ్జెట్ ను. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సోమవారం ఉదయం లోక్ సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఆమె  రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిడ్ ను కలిసారు.  పద్దును పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే ముందు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ఉదయం 8.45 గం. : తన నివాసం నుంచి నేరుగా పార్లమెంట్ నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయానికి బయల్దేరిన కేంద్ర మంత్రి నార్త్ బ్లాక్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్తో  భేటీఅయ్యారు.  తరువాత  రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి, బడ్జెట్ మొదటి ప్రతిని అందించారు. 10.00: బడ్జెట్ ప్రతులతో నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్ పార్లమెంటుకు బయల్దేరారు. బడ్జెట్, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. తరువాత 11.00 గంటలకు  లోక సభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి పార్లమెంట్ బడ్జెట్ సెషన్(తొలి భాగం) ఫిబ్రవరి 13నే ముగియనున్నట్లు సమాచారం. మార్చి 8- ఏప్రిల్ 8 మధ్య రెండో సెషన్ నిర్వహించనున్నారు.  ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ సమావేశాలు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 వరకు లోక్సభ సమావేశాలు జరగనున్నాయి.

Related Posts