YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఏవోబీలో ఎదురుకాల్పులు

ఏవోబీలో ఎదురుకాల్పులు

విశాఖపట్నం ఫిబ్రవరి 1, 
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు పోలీసులకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి.  ఈ సంఘటనలో గుర్తు తెలియని మావోయిస్టు మృతిచెందగా, మావోయిస్టులకు చెందిన 15 కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏవోబీలో మల్కన్గిరి జిల్లా ఖైర్పుట్ బ్లాక్ మత్లీ పోలీసుస్టేషన్ పరిధిలోని మడక్పొదర్ సమీప నున్ఖారీ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసులకు అందిన ఖచ్చితమైన సమాచారం ఆధారంగా ఒడిశా కు చెందిన డీవీఎఫ్ మరియు ఎస్వోజీ బలగాలు గాలింపుచర్యలు నిర్వహిస్తుండగా ఆదివారం తెల్లవారుజామున పోలీసుల కదలికలు గమనించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంబించినట్లు డీఐజీ తెలిపారు. దీంతో ఇరువర్గాలు సుమారు 45 నిముషాలు పాటు కాల్పలు జరిపారు. కాల్పులు మావోయిస్టులు వైపు నుంచి నిలిచిపోవడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని గాలించగా ఒక గుర్తుతెలియని మావోయిస్టు మృత దేహం లభించింది. అదేవిధంగా ఒక పిస్టల్,  దేశీయగన్, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంటపాత్రలు, తో మావోయిస్టు సాహిత్యంతో బాటు ఇతర సామాగ్రీను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా  ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ మాట్లాడుతూ మావోయిస్టులు హింసను వీడనాడి జనజీవన స్రవంతిలో కలవాలని, వారిని ఆదుకోవడానికి సిధ్దం గా ఉన్నామని, తప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చర్యలు నిర్వహిస్తున్నామని డీఐజీ తెలిపారు.

Related Posts