రాజన్న సిరిసిల్ల ఫిబ్రవరి 1,
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో మానసిక వికలాంగులైన ఓ మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నరోమీ గ్రామానికి చెందిన మున్నా అనే కామాంధుడు 12 సంవత్సరాల బాలికకు మాయమాటలు చెప్పి ఊర అవతలకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేయబోయాడు అనుమానంతో వెంబడించిన గ్రామస్తులకు అమ్మాయి అరుపులు వినబడడం తో అతడికి దేహశుద్ధి చేసి గ్రామపంచాయతీలో బంధించారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఆ కామాంధుడిని వదిలిపెట్టేది లేదని అతడిని శిక్షించాల్సిందే అంటూ గ్రామస్తులు పోలీసులతో వాగ్వాదానికి కొద్దిసేపు దిగారు. అతడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చి అతడిని స్టేషన్ కు తరలించారు.