YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానం

రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలి ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానం

న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 1 తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని తక్షణమే జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేయాలని కీలక తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ఢిల్లీ కాంగ్రెస్ ఏకగ్రీవంగా ఆమోదించింది.రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మోడీ నియంతృత్వ పరిపాలనను ఎదుర్కోవాలంటే రాహుల్ గాంధీ నాయకత్వమే సరైనదని అభిప్రాయం వ్యక్తం చేశారు.కాగా ఇదే సమయంలో మరో రెండు తీర్మానాలను కూడా ఢిల్లీ కాంగ్రెస్ నేతలు చేశారు. రైతు ఉద్యమంలో భాగంగా గణతంత్ర దినోత్సవం రోజున చోటుచేసుకున్న ఘర్షణలకు బాధ్యత వహిస్తూ కేంద్రహోంమంత్రి అమిత్ షా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమి తర్వాత అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు. అనేకసార్లు కాంగ్రెస్ పార్టీకి తిరిగి నాయకత్వం వహించాలని కోరినా ఆయన చేపట్టలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు సోనియాగాంధీ నాయకత్వ బాధ్యతలు చూస్తున్నారు. మరొకరిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించి తప్పుకోవాలని ఆమె చూస్తోంది. కానీ రాహుల్ మాత్రం ఈ పదవి చేపట్టడానికి సిద్ధంగా లేడు.  ఈ క్రమంలోనే రాహుల్ పై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ వర్గాలు సిద్ధమయ్యాయి.

Related Posts