హైదరాబాద్ ఫిబ్రవరి 1
కరోనా మహమ్మారి నేపధ్యంలో మూతపడిన పాఠశాలల గంట మళ్ళీ సోమవారం నుండి మోగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, తల్లిదండ్రుల అనుమతితో తొమ్మిది, పదవ తరగతి విద్యార్థుల కొరకు అన్ని ఏర్పాట్లు చేసారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని , శానిటై జేషన్ నిర్వహించి, భౌతిక దూరం పాటిస్తూ, విధిగా మాస్కు ను ధరించే విధంగా విద్యార్ధులను సిద్దం చేసారు. వచ్చిన ప్రతి విద్యార్థికి టెంపరేచర్ చెక్ చేస్తూ అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఏర్పాట్లు చేయడం జరిగిందని పాఠశాల అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులు కుడా గత ఆరునెలల తరువాత మళ్ళీ పాఠశాలలకు వస్తుండడంతో , తోటి స్నేహితులను కలిసి మాటముచ్చటలో మునిగిపోవడం , అందరిని కలుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని తల్లిదండ్రులు తెలిపారు.