న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1, బడ్జెట్ లోకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. కొత్తగా వ్యవసాయ మౌలిక సదుపాయాల సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెస్‌ను వివిధ ఉత్పత్తులపై విధించనున్నారు. ఈ సెస్‌ను దేనిపై ఎంత విధించారో ఇప్పుడు చూద్దాం.
- పెట్రోల్‌పై రూ.2.5, డీజిల్‌పై రూ.4
- బంగారం, వెండిపై 2.5 శాతం
- ఆల్కహాల్ ఉత్పత్తులపై 100 శాతం
- ముడి పామాయిల్‌పై 17.5 శాతం
- ముడి సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 20 శాతం
- ఆపిల్స్‌పై 35 శాతం
- బొగ్గు, లిగ్నైట్, పీట్‌లపై 1.5 శాతం
- ప్రత్యేకమైన ఫెర్టిలైజర్ (యూరియాలాంటివి)పై 5 శాతం
- బటానీలపై 40 శాతం
- కాబూలీ చనాపై 30 శాతం
- శనగపప్పుపై 50 శాతం
- పత్తిపై 5 శాతం