YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్

జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్

హైదరాబాద్, ఫిబ్రవరి 2, 
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టనున్నారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన కొంత కాలం విశ్రాంతి తీసుకుంటారని సమాచారం. అనంతరం ఆయన ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాలపై దృష్టి పెడతారంటున్నారు. కేటీఆర్ కు ముఖ్యమంత్రి పదవి ఖాయమయిపోయింది. ముహూర్తం ఎప్పుడనేదే తేలాలి. కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసిన తర్వాత కొన్ని రోజుల పాటు కేసీఆర్ ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు.ఇటీవల కేసీఆర్ కొంత అస్వస్థతకు గురయ్యారు. వైద్యులు కూడా ఆయనను కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రోజువారీ పాలనలో భాగంగా కేసీఆర్ వత్తిడిని ఎదుర్కొంటుండటంతో ఆయన మరింత అనారోగ్యానికి గురయ్యే అవకాశముందని కుటుంబ సభ్యులు కూడా భావిస్తున్నారు. అందుకే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసి తాను పార్టీ వ్యవహారాలను చూసుకోవాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.కొంతకాలం విశ్రాంతి తీసుకున్న అనంతరం కేసీఆర్ ఢిల్లీకి వెళతారంటున్నారు. కేసీఆర్ గతంలోనే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. అనేక రాష్ట్రాలు తిరిగి ముఖ్యనేతలను కలసి వచ్చారు. కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ‌్రంట్ ను ఏర్పాటు చేయాలని భావించినా అది సాధ్యం కాలేదు. అయితే ఈసారి దానిపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ముందే దీనికి ఒక రూపం తేవాలని కేసీఆర్ భావిస్తున్నారు.బీజేపీకి ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ రోజురోజుకూ ఉనికిని కోల్పోతుంది. యూపీఏలో కూడా ఇప్పుడు ఏ పార్టీ కలసేందుకు ఇష్టపడటం లేదు. అందుకే తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు. ఢిల్లీలోనే ఉండి ప్రధాన పార్టీల నేతలను కలసి తన వద్ద ఉన్న రూట్ మ్యాప్ ను కేసీఆర్ వివరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ రాజకీయాలను చూసుకుంుటూనే రాష్ట్రంలో పార్టీకి డైరెక్షన్ ఇవ్వాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఉంది.

Related Posts