YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సంఘటితమవుతున్న రైతు నేతలు

సంఘటితమవుతున్న రైతు నేతలు

విజయవాడ, ఫిబ్రవరి 2
రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఉద్యమంలో నిన్నమొన్నటి దాకా పంజాబుకు చెందిన నేతలు, ముఖ్యంగా సిక్కు రైతులు ఎక్కువగా కనిపించేవారు. కేంద్రంతో జరిగిన చర్చల్లోనూ వారే కీలకపాత్ర పోషించేవారు, కానీ రిపబ్లిక్ డే నాడు చోటుచేసుకున్న అవాంఛనీయ ఘటనల అనంతరం ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది. పంజాబు నేతలు తెరమరుగయ్యారు. రాకేశ్ టికాయత్  రంగంపైకి వచ్చారు. ఆయన నాయకత్వంలో రైతులు సంఘటితమవుతున్నారు. పంజాబు, హర్యానాతోపాటు దిల్లీ పొరుగునే ఉన్న యూపీ రైతులు పెద్దయెత్తున ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. రాకేశ్ టికాయత్ నాయకత్వమే ఇందుకు కారణం. రాకేశ్ నిజాయతీ, చిత్తశుద్ధి కారణంగానే ఆయన పిలుపునకు రైతులు స్పందిస్తున్నారు, ఉద్యమానికి పెద్దయెత్తున తరలివస్తున్నారు. జాతీయ మీడియా చూపంతా రాకేశ్ టికాయత్ పైకి మళ్లింది. ఆయన నేపథ్యం గురించి ఆరా తీయడం ప్రారంభించింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన రాకేశ్ తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ గొప్ప రైతు నాయకుడు. దివంగత మాజీ ప్రధాని చౌదరీ చరణసింగ్ తరవాత అంతటి కీలక రైతు నేత. మహేంద్ర సింగ్ టికాయత్ పిలుపునకు రైతులు తక్షణం ప్రతిస్పందించేవారు. 80వ దశకం చివర్లో రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించి ఉర్రూత లూగించారు. మహేంద్ర సింగ్ టికాయత్ రైతులకు ఒక పిలుపు ఇచ్చారంటే ప్రభుత్వాలు వణికిపోయేవి. 1987లో ఆయన కిసాన్ యూనియన్ (బీకేయూ) ను స్థాపించి రైతుల ఉద్యమానికి సారథ్యం వహించారు. ఆ ఏడాది జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు రైతులు కన్నుమూయడమే బీకేయూ స్థాపనకు దారితీసింది. మరణించేవరకూ కర్షకుల పోరాటానికి మద్దతుగా నిలిచారు మహేంద్ర సింగ్ టికాయత్.తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాకేశ్ టికాయత్ ఇప్పుడు రైతుల ఆందోళనకు సారథ్యం వహిస్తున్నారు. పశ్చిమ యూపీలోని ముజఫర్ నగర్ జిల్లాలోని సిసౌలీ ఆయన స్వస్థలం. పశ్చిమ యూపీ వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడ చెరకు ఎక్కువగా పండిస్తారు. ఈ ప్రాంతంలోని చక్కెర లాబీ రాజకీయంగా శక్తిమంతమైనది. ప్రభుత్వాలను మార్చేంత శక్తి దీనికి ఉంది. దివంగత మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, ప్రస్తుతం ఆయన కుమారుడు, రాష్టీయ లోక దళ్ (ఆర్ ఎల్ డీ) అధినేత అజిత్ సింగ్ ప్రాతినిథ్యం బాగ్ పట్ పార్లమెంటు స్థానం ఈ ప్రాంతంలోనే ఉంది. రాకేశ్ టికాయత్ ప్రస్థానం సాఫీగా ఏమీ సాగలేదు. న్యాయశాస్ర్తం చదివిన ఆయన తొలుత బతుకుదెరువు కోసం పోలీసు కానిస్టేబుల్ గా పనిచేశారు. తరవాత రాజకీయాలపై ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007లో ఖటౌలీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున యూపీ అసెంబ్లీకి పోటీచేశారు. 2014లో అమ్రౌలీ నియోజకవర్గం నుంచి అజిత్ సింగ్ పార్టీ ఆర్ ఎల్ డీ తరఫున అభ్యర్థిగా పార్లమెంటుకు పోటీచేసినా ఫలితం లేకపోయింది. 2011 లో తండ్రి మహేంద్ర సింగ్ టికాయత్ మరణానంతరం బీకేయూలో కీలక బాధ్యతలు చేపట్టారు.అప్పటినుంచి రాకేశ్ టికాయత్ రైతు సమస్యలపై ఉద్యమిస్తూనే ఉన్నారు. అనేక ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా 44సార్లు జైలుకెళ్లి వచ్చారు. రుణమాఫీ, కనీస మద్దతు ధర (ఎం ఎస్ పీ- మినిమమ్ సపోర్టు ప్రైస్), వ్యవసాయ విద్యుత్తు ధరలు, భూసేకరణ వంటి అంశాలపై యూపీ, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్రాల్లో ఉద్యమాలు చేశారు. తాజాగారైతు ఉద్యమం ఆయన చుట్టూనే తిరుగుతోంది. జనవరి 26 నాటి ఘటనలు తనను కలచివేశాయని భావోద్వాగానికి లోనైన రాకేశ్ టికాయత్ ఎవరెంత రెచ్చగొట్టినా శాంతియుత ఉద్యమం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ప్రకటించడం ఆయన నిజయతీ, చిత్తశుద్ధికి నిదన్శనం. తండ్రి అహింసా మార్గంలో ప్రయాణించి విజయవంతం కాగలనన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Related Posts