YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

తెరపైకి ఉత్తరాది వర్సెస్ దక్షిణాది

తెరపైకి ఉత్తరాది వర్సెస్ దక్షిణాది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2
దక్షిణాది నుంచి పన్నులు వసూలు చేయడం.. ఉత్తరాదికి పంపిణీ చేయడం..” బడ్జెట్ ప్రకటన తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ వినిపించిన అభిప్రాయం ఇది. పెద్ద ఎత్తున నిధులు.. ఉత్తరాది రాష్ట్రాలకే ప్రవహింప చేశారు. ఎన్నికలున్న కారణంగా తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కొన్ని నిధులు ప్రకటించారు. కానీ గత చరిత్ర చూస్తే..కేటాయింపులు పూర్తిగా ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. దీంతో దక్షిణాది ఎంపీల్లోనూ గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఈ నిరాదరణ ఇంకెంత కాలం అన్న చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఈ అంశంపై మీడియాతో పిచ్చాపాటిగా మాట్లారు. జమిలీ ఎన్నికలు పెట్టి.. అధ్యక్ష పద్దతిలోకి మార్చాలనుకున్న వ్యూహం బడ్జెట్‌లో కనిపిస్తోందని ఆయన
విశ్లేషించారు. జమిలీ ఎన్నికలు జరిగితే .. దేశం రెండుగా విడిపోవడం ఖాయమని.. అదే జరిగితే అధ్యక్షడు కావడానికి దక్షిణ భారత్ ఓట్లు అవసం పడవని అంటున్నారు. జమిలి ఎన్నికలు జరగగానే .. దేశ విభజన ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని జోస్యం చెప్పారు. అదే జరిగితే దక్షిణాది దేశం అత్యంత ధనిక దేశం అవుతుందని గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల అవసరం లేకుండా అధ్యక్షుడి ఎన్నిక జరిగినప్పుడు .. ఇక్కడి ప్రజలు ఎందుకు ఊరుకుంటారని ..  
మోదీ ప్రధాని అయ్యాక దక్షిణ రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గిందని గుర్తుచేశారు. ట్యాక్స్ అత్యధికంగా కడుతుంది దక్షిణ భారత్ రాష్ట్రాల వారే .. కానీ నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు వెళుతున్నాయని లెక్కలు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల వివక్షకు కారణమయ్యే జమీలి ఎన్నికల ఆలోచనను మోదీ విరమించుకోవాలని .. లేకుంటే ఈ అన్ని అంశాలను పార్లమెంట్ లోనే మాట్లాడుతానని హెచ్చరించారు. కేంద్ర బడ్జెట్ లో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయడం ఇప్పుడు కొత్తేమీ కాదు గతంలో బీహార్ కు ఐదు లక్షల కోట్ల ప్యాకేజీ అన్నారు .. ఏమైందని రేవంత్ ప్రశ్నిస్తున్నారు. రేవంత్ తో పాటు మరికొంత మంది ఎంపీల అభిప్రాయం కూడా అంతే ఉంది. నియామకాలు.. నిధుల్లో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. అయితే దక్షిణాది మొత్తం ఏకమయినప్పుడే… ఇలాంటి పరిణామం సాధ్యమవుతుంది. కానీ ఇక్కడి ప్రజలకు అంత తీరిక ఉందా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. కానీ అణిచివేత అధికమయ్యే కొద్దీ తిరుగుబాటు తీవ్రమవుతుందనే నినాదం ఉండనే ఉంది.

Related Posts