పొలింగ్ శాతం పెంచాలి
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్
విశాఖపట్నం ఫిబ్రవరి 2
ఈ రోజు జిల్లా పర్యటన లో భాగంగా విశాఖ లో ఏర్పాట్లు పర్యవేక్షించాం. ఏర్పాట్లు చాలా బాగా చేశారు. జిల్లా లో ప్రజలకు ఎన్నికలు పట్ల మంచి అవగాహన కల్పించారు. విశాఖలో విజ్ఞులు ఎక్కువ మంది ఉన్నారు. అధికారులు కూడా చక్కటి ప్రతిభావంతులు ఉన్నారు. విశాఖ లో పోలింగ్ శాతం తక్కువ ఉంటోంది. విజయనగరం జిల్లాతో పోల్చుకుంటే కాస్త వెనుకబడింది. ఓటర్లు మరింతగా వోటింగ్ కు ముందుకు రావాలి. గతంలో కంటే ఓటింగ్ టైం పెంచాం. కోవిడ్ వ్యాప్తి నివారణ జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రజలు ఎలాంటి భయం లేకుండా ఓటింగ్ లో పాల్గొనవచ్చు. ఏకగ్రీవాలు విషయంలో రాజ్యాంగం ఏం చెబుతోందో మా మనసులో అదే ఉంది. పార్టీలను కానీ, వ్యక్తులను కానీ కించ పరిచే తీరు ఎప్పుడు మాకు లేదు. పూర్తిగా ఏకగ్రీవానికి వ్యతిరేకానికి ఎన్నికల సంఘం ఉండదు. కొన్ని పంచాయతీలు ఆర్ధిక సామాజిక దృష్ట్యా ఏకగ్రీవాలు సమంజసం. విశాఖ లాంటి జిల్లాలో 10 లేదా 15 శాతమో ఏకగ్రీవాల ఐతే పర్వాలేదు. కానీ ఆ శాతం 40 నుంచి 45 శాతం ఉంటే అది జిల్లా ఎన్నికల యంత్రాంగ విఫలం అనుకోవాలని అన్నారు. వెనుకబడిన వారికి, మహిళలకు అవకాశాలు ఇస్తున్నాము. రేపు ఎన్నికల నిర్వహణ పై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము. ఎన్నికల సంఘo నిఘా వ్యవస్థ కంటే... పత్రికా, మీడియా వ్యవస్థ బలమైనది. మీతో కలిసి ఈ ఎన్నికలో విధుల్లో పని చేయడం ఆనందంగా వుందని అన్నారు.