నర్సీపట్నంలో నామినేషన్లు షురూ
విశాఖపట్నం ఫిబ్రవరి 2
నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోరెండో విడత పంచాయితీ ఎన్నికలు నామినేషన్లు స్వీకరణ మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 10.30 నుంచి 5 గంటలు వరకు నామినేషన్లు దాఖలు అయ్యాయి. మొత్తం 10 మండలాల్లో రెండోవిడత లో 261 గ్రామాల్లో పంచాయితీ సర్పంచ్, 2584 వార్డ్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు వివాదాలు కారణం గా నక్కపల్లి మండలం దోసలపాడు, చీడిగ గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేసారు. నేటి నుంచి మూడురోజులు పాటు రెండో విడత పంచాయితీ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ జరుగుతుంది. ఈనెల 4 తేదీ 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చిరు. 5 తేదీ నామినేషన్లు పరిశీలన జరుగుతుంది. 8తేదీ నామినేషన్ లు మధ్యాహ్నం 3 గంటలు లోపు ఉపసంహరణ గడువు, అదే రోజు 4 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులు జాబితా ప్రకటన వుంటుంది. ఈనెల 13 తేదీ రెండో విడత పంచాయితీ పోలింగ్, అదే రోజు ఫలితాలు ప్రకటన వెలువడుతుంది. నర్సీపట్నం డివిజన్ పరిధిలో 2604 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. రెండోవిడత పంచాయితీ ఎన్నికల్లో 4,97,782 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకొనున్నారు.