YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

నైజాంలో ఆచార్య 35 కోట్లు

నైజాంలో ఆచార్య 35 కోట్లు

నైజాంలో ఆచార్య 35 కోట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 2, 
మెగాస్టార్ చిరంజీవికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదేళ్లు గ్యాప్ తీసుకుని వచ్చిన తర్వాత కూడా చిరు మార్కెట్ ఎక్కడా తగ్గలేదు. ఇంకా పెరిగింది. ఖైదీ నెం 150 సినిమాతో పదేళ్ల తర్వాత వచ్చి 100 కోట్లు షేర్ వసూలు చేసాడు చిరంజీవి. సైరా కూడా 130 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. అందుకే చిరు సినిమాలకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈయన సినిమాలు నైజాంలో చరిత్ర తిరగరాస్తుంటాయి. నైజాం అంటేనే చిరుకు పెట్టనికోట. కెరీర్ మొదట్నుంచీ చిరు సినిమాలకు ఇక్కడ అదిరిపోయే మార్కెట్ ఉంది. మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లక ముందు నుంచే ఈయన సినిమాలు అక్కడ 10 కోట్ల మార్క్ అందుకున్నాయంటే మెగా ప్రభంజనం ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి టికెట్ రేట్స్ కు మార్కెట్ మరింత పెరిగిపోయింది. 
దాంతో ఇప్పుడు మెగాస్టార్ సినిమాలు ఇక్కడ 30 కోట్లకు పైగానే షేర్ వసూలు చేస్తున్నాయి. దాంతో రైట్స్ కూడా అదే స్థాయిలో పలుకుతున్నాయి. ఇప్పుడు ఆచార్య సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు రెక్కలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా నైజాంలో పిచ్చెక్కిస్తున్నాడు ఆచార్య. చిరంజీవి సినిమాలకు నైజాంలో ఎలాంటి మార్కెట్ ఉందనేది ఖైదీ నెం 150, సైరా సినిమాలు నిరూపించాయి. ఇందులో ఒకటి 25 కోట్లు, మరోటి 30 కోట్లు వసూలు చేసాయి. దాంతో ఆచార్య రేంజ్ ఏంటనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సైతం ఇదే స్థాయిలో కోట్ చేస్తున్నారు నిర్మాతలు. సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌లో రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  మే 13న ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా విడుదల కానుంది. దాంతో ఇప్పట్నుంచే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. కొన్ని ఏరియాల్లో రేట్స్ కూడా ఫైనల్ అయిపోయాయి. టీజర్ కూడా బాగానే ఉండటంతో బిజినెస్ దీనిపై కూడా ఆధారపడుతుంది. నైజాం కోసమే 35 కోట్ల వరకు నిర్మాతలు కోట్ చేసినట్లు తెలుస్తుంది. ఇది భారీ మొత్తమే అయినా కూడా చిరు సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే తక్కువే అవుతుంది. ఎందుకంటే ఆచార్యకు కానీ హిట్ టాక్ వచ్చిందంటే కచ్చితంగా 40 కోట్ల వరకు వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఆచార్యతో తాను నైజాం కింగ్ అని మరోసారి రుజువు చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి.

Related Posts