YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాంగ్రెస్ రాజ్యంగ పరిరక్షణ కార్యక్రమం ప్రారంభం

కాంగ్రెస్ రాజ్యంగ పరిరక్షణ కార్యక్రమం ప్రారంభం

కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ‘రాజ్యాంగ పరిరక్షణ’ ఉద్యమానికి శ్రీకార చుట్టింది. సోమవారం నాడు  ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ , ప్రధాన కార్యదర్శి గులాంనబీ ఆజాద్,  మల్లికార్జున ఖర్గే, సుశీల్ కుమార్ షిండే పాల్గొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజ్యాంగం, దళిత సమాజంపై దాడులు జరుగుతున్నాయని రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా దళితులు, అణగారిన వర్గాల చేరువకు పార్టీని తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమమని వివరించారు. దళిత వర్గాలపై ప్రస్తుతం జరుగుతున్న దాడుల అంశంపై ఆయా వర్గాల్లో మరింత చైతన్యం తీసుకొని రావడానికి కాంగ్రెస్ యత్నిస్తోందని అన్నారు. ప్రదాని మోడి దళిత వ్యతిరేకి, దేశంలో చాలా ప్రాంతాలలో దళితులపై ఆత్యాచారాలు జరుగుతున్నాయి. బిజేపీ పాలనలో దేశంలో దళితులకు, మహీళలకు, మైనారీటిలకు రక్షణ లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా రాజ్యాంగానికి లోబడి పని చేయ్యాలి. సుప్రీంకోర్టును కేంద్రం ప్రభుత్వం వాడుకుంటుందని అయన అరోపించారు. పార్లమెంటు నడవ కుండా చేస్తున్నారు. ఎక్కడ అయినా ప్రతిపక్షం అడ్డుకుంటారు సభను ..కాని అదికార పక్షం అడ్డుకుంటుంది. దేశంలో బ్యాంకు  కుంభకోణాలు పెరుగుతున్నాయి. వాటని పై చర్చించాలని పట్టుబడితే సమయం ఇవ్వరు పార్లమెంటులో. దేశంలో ఎవ్వరూ మాట్లాడాకూడాదు . వినకూడదు ..కేవలం మోడి మన్ కీ బాత్ వినాలి...బిజెపి పార్టీలో ఇంక ఎవ్వరి మాట విన కూడదు. బేటి బచావ్ కాదు  ,  మోడి నుంచి దేశాన్ని బచావ్ అని రాహుల్ అన్నారు. నరేంద్ర మోదీకి 2019 ఎన్నికలలో దేశ ప్రజలు వారి మన్ కీ బాత్ చూపిస్తారు. దేశంలో ప్రస్తుతం  నియంత్రణ పాలన కోనసాగుతుంది. వీటిని ఆపాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. దేశంలో చిన్న పిల్లను, మహీళ పై ఆత్యాచారాలు కోనసాగుతున్నా వాటిని ఆపాలి అంటే కాంగ్రెస్ తో మాత్రమే సాద్యం అవుతుందని అయన అన్నారు. దళితులకు, మైనారిటీలకు న్యాయం కాంగ్రెస్ మాత్రమే చేయ్యగలదు. 70 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని చాలా అభివృద్ధి చేసింది...మోడి అదికారంలోకి వచ్చిన నాలుగు సంవత్సరాలలో  70 సంవత్సరాల మా శ్రమ వృదా చేశాడు. దేశాన్ని వెనక్కి తీసుకపోయాడు. ఎస్ ,ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయ్యాలని  మోడి ప్రభుత్వం చూస్తుంది. నాలుగు సంవత్సరాలలో ఆదివాసీలకు, దళితులకు మోడి ప్రభుత్వం ఎమి చెయ్యాలేదు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నిర్వీర్యం చేయ్యలని చూస్తే మేము ఊరుకోము...దీనిపై పార్లమెంటులో పోరాడుతాం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని మార్పు చేయ్యాలని చూస్తే ప్రతిఘటిస్తామని అయన హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ నేతలు, యువకులు, మహిళలు, సేవాదళ్ విభాగాలు,  దళిత వర్గాలకు చెందిన  ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా పరిషత్లు, పౌర సంస్థలు, పంచాయతీ సమితులకు నేతృత్వం వహించిన నాయకులు  ఈ ఉద్యమ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ తేదీన బీఆర్ అంబేడ్కర్ జయంతి వరకు ఈ ప్రచార కార్యక్రమం కొనసాగుతుంది. 

Related Posts