కడప ఫిబ్రవరి 3 పంచాయతీ ఎన్నికలు సందర్భంగా పోలీసులు చేస్తున్న తనిఖీలు అక్రమార్కుల భాగోతం బయట పడుతోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు రురల్ పోలీసులు జరిపిప తనిఖీల్లో భారీ ఎత్తున బంగారూ ఆభరణాలు, వెండి వస్తువులు, నగదు దొరికాయి. ఎలాంటి బిల్లులు, రికార్డులు లేకుండా తరలిస్తున్న 2 కేజీల 900 గ్రాముల బంగారూ ఆభరణాలు, ఏడు లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి నుంచి 5 కిలోల వెండి, 2లక్షలు నగదు స్వాధీనం పరుచుకుని కేసు నమోదు చేసినట్లు ప్రొద్దుటూరు డీఎస్పీ వై.ప్రసాద్ రావు మీడియాకు వివరించారు. ఇకపై తనిఖీలు ఇలాగే కొనసాగిస్తామని డీఎస్పీ చెప్పారు. డబ్బు బంగారం తీసుకెళ్లే వ్యక్తుల దగ్గర బిల్లులు తప్పనిసరిగా ఉంచుకోవాలని, 50 వేలకు మించి డబ్బు ఉంటే తగిన ఆధారాలు ఉండాలని డీఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.