ఫిబ్రవరి 03
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం నాలుగు దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఫిబ్రవరి 9 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎన్నికల కోసం ఎంత వరకు ఖర్చు చెయ్యొచ్చు అనే దానిపై రాష్ట్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. 2011 జనాభా ప్రాతిపదికన 10 వేలకు మించి జనాభా కలిగిన పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థుల వ్యయపరిమితి రూ.2.50 లక్షలుగా, వార్డు అభ్యర్థుల వ్యవపరిమితి రూ.50 వేలుగా నిర్ణయించారు. ఇక 10వేల కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు రూ. 1.50 లక్షలు, వార్డు అభ్యర్థులైతే రూ.30 వేలు వరకు వ్య్వపరిమితికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.