విజయవాడ, ఫిబ్రవరి 4,
అవును నిజమే. ఇప్పుడు రాముడే రాజకీయం. రాముడే ప్రజాక్షేత్రం.. రాముడే రాజకీయ తంత్రం.. రాముడే రాజకీయాలకు మంత్రం. అంతా అలాగే ఉంది. ఏ పాలిటిక్స్ చూసినా రాముడు రాముడు రాముడే. అంతే. రాముడు చుట్టూనే వైఫైలా తిరుగుతుంది రాజకీయం. రాముడికి ఏ మాత్రం దూరంగా పోయినా.. ప్రజలకు గురుత్వాకర్షణ శక్తి పని చేయకుండా పోతుందని.. పార్టీ జనాలకి దూరంగా పోతుంది అని.. అక్కడక్కడే తిరుగుతోంది.మొన్నటి దాకా.. ఆంధ్రాలో రామ తీర్థం ఇష్యూ చూశాం. కదా.. రాముడి దగ్గర మొదలైన రాజకీయ రథం.. ఏపీ మొత్తం తిరిగింది. ప్రతి పొలిటీషియనూ అదే చేశారు. అందులో వాళ్లు వీళ్లు అని స్పెషల్ గా చెప్పేదేం లేదు. బీజేపీ వాళ్లు నార్మల్ గానే కాస్త ఎక్కువ చేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే కదా. ఇక నేషనల్ పాలిటిక్స్ లో కూడా రాముడే రాజకీయాలకు అర్దం పర్దం.. పరమార్దం చూపుతున్నారు. ఆయన్ని అడ్డుగా పెట్టుకుని.. రాజకీయంగా ఎదగాలని చూసే పార్టీలు ఫుల్ గా పెరుగుతున్నాయి. బీజేపీ ఎప్పటి నుంచో ఇదే లైన్ లో ఉంది ఆ విషయం అందరికీ తెలిసిందే. నిన్న మొన్న కూడా తెలంగాణలో ఎంత రచ్చ జరిగిందో చూశాం కదా. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు ఫైటింగ్ జరిగింది. ఇక తెలంగాణ ఎవ్వారం అలా వదిలేస్తే.. నేషనల్ గా కూడా అదే నడుస్తోంది.ది మోస్ట్ సెక్యులర్ పార్టీ ఇన్ కంట్రీ అని చెప్పుకునే.. కాంగ్రెస్ కూడా సైడ్ స్టాండ్ వేస్తోంది. రాముడి సైడ్ నుంచుంటోంది. లేదంటే.. బీజేపీ ఇంకా ముందుకు పోతుందని.. ఆల్రెడీ వెనకపడ్డ తాము ఇంకా వెనకపడి పోతాం అంటూ.. రాముడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే.. పార్టీకి కలిసి వస్తుంది అని నమ్ముతున్నారు కావచ్చు. లేదంటే రాముడి దయతో ముందుకు నెట్టుకుని వెళ్లొచ్చు అనుకుంటున్నారు కావచ్చు. అందుకే.. కాంగ్రెస్ యూత్ వింగ్ కూడా.. వసూళ్లు మొదలుపెట్టింది. అయోధ్య రాముడి కోసం చందాలు వసూల్ చేస్తూ.. రామ భక్తితో పాటు.. దైవ భక్తి కూడా చూపిస్తున్నారు. మరి ఈ ప్రయాణం.. కాంగ్రెస్ కి ఎంత కలిసి వస్తుందో చూడాలి.