కర్నూలు ఫిబ్రవరి 4
కర్నూలు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక హోటల్ లో సమావేశాన్ని నిర్వహించారు. దీనికి మంత్రులు బొత్స సత్యనారాయణ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. అనిల్ కుమార్.. జయరాంలు హాజరయ్యారు. సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్న వేళ.. నందికొట్టూరు ఎమ్మెల్యే ఆర్థర్ కు.. బైరెడ్డి సిద్దార్థ్ కు మధ్య మాటల యుద్ధం నడవటం.. ఇరు పక్షాలకు చెందిన వారే కాదు.. నేతలు సైతం కొట్టుకునే వరకు విషయం వెళ్లిందని చెబుతున్నారు.దీంతో.. అక్కడే ఉన్న మంత్రులు కలుగజేసుకోవటంతో వివాదం సద్దుమణిగినట్లుగా చెబుతుననారు. మంత్రుల సమక్షంలోనే అధికార పార్టీకిచెందిన నేతల మధ్య జరిగిన గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అయినప్పటికీ నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కావటం లేదని ఆర్థర్ ఆరోపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ సిద్దార్థ్ కలుగజేసుకుంటున్నారని.. అధిపత్యం ప్రదర్శిస్తున్నారంటున్నారు.ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో పేరుకే తాను ఎమ్మెల్యేగా ఉన్నాను తప్పించి.. పెత్తనం మొత్తం సిద్ధార్థదేననివాపోతున్నారు.ఇదిలా ఉంటే.. ఆర్థర్ గెలుపుకోసం తన శక్తివంచన లేకుండా కష్టపడ్డానని.. తనకు ఏ మాత్రం గుర్తింపు లభించటం లేదని సిద్ధార్థ్ వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ఇరువురు నేతల మధ్య జరిగిన గొడవలో.. ఎమ్మెల్యే ఆర్థర్ పైకి సిద్ధార్థ్ కుర్చీ విసిరినట్లు చెబుతున్నారు. పోలీసు శాఖలో ఉద్యోగం చేసి ఉన్నత స్థాయికి ఎదిగారు ఆర్థర్. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ అసెంబ్లీకి చీఫ్ మార్షల్ లాంటి ఉన్నత పదవుల్ని చేపట్టి.. వైఎస్ పట్ల ఆకర్షణతో రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి.. తొలిసారి టికెట్ సంపాదించి విజయం సాధించారు. అయినప్పటికీ.. ఆయనకు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో ఉన్న పంచాయితీతో.. ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లు చెప్పక తప్పదు. మరీ.. పంచాయితీ లెక్కను సీఎం జగన్ ఎప్పుడు తీరుస్తారో చూడాలి.