YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికలను నిష్పక్షపాతంగా , పారదర్శకంగా నిర్వహించాలి ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్

ఎన్నికలను  నిష్పక్షపాతంగా , పారదర్శకంగా  నిర్వహించాలి  ఎస్ ఈ సి నిమ్మగడ్డ రమేష్ కుమార్

నెల్లూరు ఫిబ్రవరి 4 
నెల్లూరు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా , పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా ఎస్పీ ,ఇతర శాఖల అధికారులకుసూచించారు.నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆయన గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తునన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల కోడ్ ను జిల్లాలో ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి తన దృష్టికి వచ్చిన పలు అంశాలను ఆయన ఈ సమీక్ష సమావేశంలో ప్రస్తావించారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు నియమించిన రిటర్నింగ్ అధికారులు, తమ బాధ్యతను గుర్తెరిగి పనిచేయాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన పలు చర్యలను జిల్లా అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు, పోలీస్ శాఖ ఐజీ సంజయ్, డీఐజీ త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ జాయింట్ కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి , జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్,  గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు,ఎన్నికల అబ్జర్వర్ పాల్గొన్నారు.
 

Related Posts