YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కూమారస్వామి కింగ్ మేకర్ ఆశలు

కూమారస్వామి కింగ్ మేకర్ ఆశలు

బెంగళూర్, ఫిబ్రవరి 5 
తండ్రి మీద ఆధారపడే ఆ పార్టీ నడుస్తుంది. కుటుంబ పార్టీగా ముద్రపడినా కర్ణాటక రాజకీయాల్లో దశాబ్దాలుగా చరిత్ర సృష్టించిన పార్టీ అది. కానీ రాను రాను ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుంది. కర్ణాటకలో జనతాదళ్ ఎస్ కేవలం దేవగౌడ కారణంగానే అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ అధినేతగా ఆయన ప్రధానమంత్రి కూడా కాగలిగారు. కానీ గత కొన్ని రోజులుగా ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుంది. దీనికి కుమారస్వామి పోకడలే కారణమంటున్నారు.మొన్నటి ఎన్నికల్లో కనీస స్థానాలను సాధించలేకపోయినా దేవగౌడ చాకచాక్యంగా వ్యవహరించి తనయుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయగలిగారు. అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా విజయం సాధించకపోయినా అధికారంలో ఉంటే పార్టీ బలోపేతం అవుతుందని భావించారు. కానీ పథ్నాలుగు నెలలు అధికారంలో ఉన్నా, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్నా పార్టీని ఏమాత్రం పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.కుమారస్వామి వ్యవహారశైలి కారణంగానే పార్టీ బలోపేతం కాలేదని అంటున్నారు. ఇప్పుడు దేవగౌడ కూడా పార్టీని శాసించే పరిస్థితుల్లో లేరు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఎక్కువగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తామని కుమారస్వామి పదేపదే చెబుతున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని దేవెగౌడ, తనయుడు నిఖిల్ గౌడ ఓటమి పాలు కావడంతో కాంగ్రెస్ కు పూర్తిగా కుమారస్వామి కటీఫ్ చేప్పేశారు.దీంతో ఒంటరిగా పోటీ చేసి ఏ మేరకు విజయం సాధిస్తారన్నది పార్టీలో చర్చగా ఉంది. కుమారస్వామి నాయకత్వంపై నమ్మకంలేక ఇప్పటికే కొందరు నేతలు సర్దుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో తక్కువ స్థానాలు సాధించినా బీజేపీతో కలసి ప్రభుత్వం ఏర్పాటు చేసి తాను ముఖ్యమంత్రిని మరోసారి కావాలని కుమారస్వామి కసరత్తు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కుమారస్వామి కారణంగా జేడీఎస్ కు పట్టున్న ప్రాంతాల్లో సయితం బలహీనపడటం ఆందోళన కల్గిస్తుంది. మరి కుమారస్వామి పార్టీని ఎలా గట్టెక్కించగలుగుతారో చూడాల్సి ఉంది 

Related Posts