YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

బడ్జెట్ కసరత్తు షురూ..

బడ్జెట్ కసరత్తు షురూ..

హైదరాబాద్, ఫిబ్రవరి 5,
బడ్జెట్ కూర్పు పై సీఎం సమీక్ష , కేంద్ర నిధులు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో బడ్జెట్ సర్దుబాటు పై ఫోకస్ చేసిన ఆర్థిక శాఖ , కరోనా తో రాబడి తగ్గడం ,కేంద్ర నిధులు తగ్గడంతో భారాన్ని ఎలా మోసేదీ అంటుంన్న ఆర్థిక శాఖ , శాఖ ల బడ్జెట్ కూర్పు వాస్తవికతకు అద్దంపట్టేలా ఉండాలంటుంన్న సీఎం... ఇంతకీ బడ్జెట్ అంచనా ఏంత ...2021 -22 ఆర్థిక  సంవత్సరం బడ్జెట్ కూర్పు పై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఆర్థిక మంత్రి హరీష్ రావు , ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు... ఇప్పటికే అన్ని శాఖ లు బడ్జెట్ కూర్పు పై తమ నివేదికలు ఆర్థిక శాఖ కు అందజేసాయి..గత సంవత్సరం లక్షా 82వేల కోట్ల బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది... కానీ కరోనా తో దాదాపు50వేల కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది ప్రభుత్వం ..దీంతో బడ్జెట్ అంచనాలను మళ్ళీ సవరించి..వివిధ శాఖ ల బడ్జెట్ లో కోత విధించింది ప్రభుత్వం.ఇక ఈ సంవత్సరం ఇప్పుడిపుడే ఆర్ధికంగా కోలుకుంటుంన్న రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్  తల మీద తాటి కాయ పడ్డట్టు తయారయింది.. రాష్ట్ర ప్రభుత్వం నివేధించిన ఏ ఓక్క అంశాన్ని పరిగణలోనికి తీసుపోకపోగా  కేంద్ర నుంచి విదిగా  రావాల్సిన నిధులలో కూడా కోత పెట్టింది.. దీంతో బడ్జెట్ కూర్పు ఎలా చేయాలో తెలియక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటుంన్నారు...అయితే బడ్జెట్ కూర్పు పైన జరిగిన సమీక్ష లో సీఎం కేసీఆర్ అనేక సూచనలు ఆర్దిక శాఖ అధికారులకు చేసినట్లు సమాచారం ..గతంలో వివిధ శాఖలు బడ్జెట్ కోసం ఇచ్చిన అంచనాలు కాకుండా ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ని దృష్టిలో పెట్టుకొని మరోసారి అంచనాలు తీసుకోవాలని సూచించారట. గతంలో లాగ వ్యవసాయం ,ఇరిగేషన్ రంగాలకు ఈ సారి బడ్జెట్ లో అంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.. కేంద్ర బడ్జెట్ లాగే రాష్ట్ర బడ్జెట్ కూడా హెల్త్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది...ఇక ఆర్టీసీ నష్టాలలో ఉండడంతో ప్రభుత్వం సహాయం చేయాల్సి వస్తుంది... ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రభుత్వం ఆ భారాన్ని తగ్గించుకునే ఆలోచన లో ఉందని సమాచారం...ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మరికొన్ని మార్గాలు అన్వేషిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు... విద్యుత్ ఛార్జీలు పెంచడం,మధ్యం ధరల పెంపు  తో పాటు ,ఎల్ ఆర్ ఎస్ ను మళ్ళీ తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తుందట ప్రభుత్వం..ఇలా ఆదాయం సమకూరే మార్గాలను అన్వేషిస్తుంది ప్రభుత్వం...అయితే ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే...గత సంవత్సరం ప్రవేశ పెట్టిన లక్షా 82వేల కోట్ల బడ్జెట్ కు మించే అవకాశం లేదని ..ఈ బడ్జెట్ సాదా సీదా బడ్జెట్ గా ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు...

Related Posts