YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

అంతరించిపోతున్న మడ

 అంతరించిపోతున్న మడ
ప్రకృతి వైపరీత్యాల సమయంలో సముద్రతీర ప్రాంత గ్రామాలకు రక్షణ కోటగా నిలిచే మడ అడవులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యంలో కీలక భూమిక పోషించే ఈ మొక్కలు నాశనమైపోతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మడ అడవుల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. అమల్లో అలక్ష్యం తీరప్రాంతాలకు శాపంగా మారుతోంది. మడ విస్తీర్ణం పెంపొందిచే చర్యలు చేపడుతున్నట్టు అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆక్వా మోజులో నిబంధనలను తుంగలోకి తొక్కి పుట్టుకొస్తున్న రొయ్యల చెరువులు మడ విధ్వంస కారకాలుగా మారుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. 
‌్ర జిల్లాలో 111 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్ర తీర ప్రాంతానికి రక్షణ ఉండాల్సిన మడ అడవులు క్రమేపీ కనుమరుగవుతున్నాయి. ఈ మొక్కల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తీరప్రాంత గ్రామాల ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం కొంత కారణమైతే, ప్రాధాన్యం తెలిసిఉన్న అధికార యంత్రాంగం నిర్లక్ష్యం ఈ అడవులను దెబ్బతీస్తోంది.
పూర్తిగా క్షార స్వభావమైన నేలలో ఉప్పునీటి కయ్యల్లో గడ్డిపరక కూడా మొలిచే అవకాశం లేని సముద్ర తీర ప్రాంతంలో మడ రూపుదిద్దుకోవడం ప్రకృతి ప్రసాదించిన వరంగానే భావించవచ్చు. ‌ తీర ప్రాంత భూభాగం వైపు ఎగిసి పడుతూ వచ్చే అలలను అడ్డుకోవడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల తీవ్రతను అడ్డుకుంటూ రక్షణ కోటగా ఉండే ఈ అడవుల వల్ల ఇతరత్రా ప్రయోజనాలు అనేకం ఉన్నాయి.  విదేశీ ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టడంతో పాటు జిల్లా ఆర్థికాభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న మత్స్య సంబంధిత రంగాన్ని కూడా ఈ అడవులు ప్రభావితం చేస్తాయి. మత్స్య సంపద పునరుత్పత్తి కోసం  దోహదపడతాయి. సూర్యరశ్మిలో ఉండే ప్రమాదకర కిరణాలను సంగ్రహించడం, చిత్తడి భూముల నుంచి విడుదలయ్యే హానికర వాయువులను ఇముడ్చుకోవడం, నీటిలోని క్షారత్వాన్ని గ్రహించడం, ఇతర వృక్ష జాలంతో పోలిస్తే రెండు  రెట్లు అధికంగా ప్రాణవాయువు విడుదల చేయడం, పరిసర ప్రాంతాల్లో సూర్య తాపాన్ని రెండు మూడు డిగ్రీల మేర తగ్గించగలడం వంటి ప్రయోజనాలు సాధ్యపడతాయి.
ఇటీవల చెరువుల అక్రమ తవ్వకం ఆగినట్టు అనిపించినా ప్రభుత్వం ఆక్వా వృద్ధిని దృష్టిలో ఉంచుకొని కల్పించిన వెసులుబాటు మాటున మళ్లీ విధ్వంసం జడలు విప్పుతోంది. పంటలకు యోగ్యం కాని అసైన్డ్‌ భూముల్లో ఆక్వా సాగుకు అనుమతులిస్తూ గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎక్కువగా అసైన్డ్‌ భూములన్నీ సముద్రతీర ప్రాంత మండలాల్లోనే ఉన్నాయి. ఈ భూముల్లో చెరువులు తవ్వుకొని ఏడాది పాటు సాగు చేసుకునేందుకు కల్టివేషన్‌ ఆఫ్‌ సర్టిఫికెట్‌(సీవోసీ)లు  మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకోసం తీర ప్రాంత మండలాల నుంచి వందలాది దరఖాస్తులు వచ్చాయి. ఒక్క మచిలీపట్నం పరిధిలోనే దాదాపు 150కి పైగా దరఖాస్తులకు అనుమతులిచ్చారు. కృత్తివెన్ను. నాగాయలంక, బంటుమిల్లి ప్రాంతాల్లో కూడా అనుమతులు మంజూరు చేశారు. ఈ అనుమతిని అడ్డంపెట్టుకొని విస్తీర్ణానికి మించి  అడవులను విధ్వంసం చేస్తూ చెరువులు తవ్వేస్తున్నారు. 
బందరు మండలం పెదపట్నం సమీపంలో ఇదే తరహా ఆగడాలు వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు దాడి చేసి పొక్లెయిన్‌, తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. బంటుమిల్లి మండలం శివారు నారాయణపురం, కృత్తివెన్ను మండలం ఇంతేరు తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ అడవులను నిర్మూలిస్తూ చెరువుల తవ్వకం కొనసాగుతోంది. అధికారులు పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 జిల్లాలో బందరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, నాగాయలంక తదితర సముద్ర తీర ప్రాంతాల్లో మడ 27,661 హెక్టార్లలో విస్తరించి ఉన్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేసున్నాయి. ఆక్వా సాగు విస్తరించడంతో అందుకు తగ్గ విధంగా ఈ అడవుల విధ్వంసం  సాగుతోంది. మడ పరిరక్షించే విషయంలో అటవీ శాఖ, వ్యన్యప్రాణి సంరక్షణ విభాగం, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుంది. మూడు విభాగాలు సమన్వయంతో వ్యవహరించకుండా ఎవరి వారే అన్న రీతిలో ఉండటం వీటి
జిల్లాలో దాదాపు 50 వేల హెక్టార్లకు చేరువగా అటవీ విస్తీర్ణం ఉంది. రాజకీయ ప్రయోజనాల కోసం అటవీ భూములను డీనోటిఫై చేసి రెవెన్యూ శాఖకు అప్పగించారు. అప్పట్లో అందులో కొంత మేర సాగు కోసం పేద వర్గాలకు పంపిణీ చేశారు. క్షార స్వభావ నేలలు కావడంతో ఎవ్వరూ వాటి మొహం కూడా చూడలేదు. పేదలకు పంపిణీ చేయగా మిగిలిన డీనోటిఫై చేసిన భూమి రెవెన్యూ శాఖకు చెందినదిగా మిగిలిపోయింది. 
అక్రమార్కుల కన్ను తీరప్రాంతంపై పడింది. డీనోటిఫై చేసిన అటవీ భూములతో పాటు నాగాయలంక, కోడూరు, మచిలీపట్నం, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల పరిధిలోని మడ అడవులు విస్తరించిన ప్రాంతాలతో కలుపుకొని వేలాది ఎకరాలు నిబంధనలకు తిలోదకాలిచ్చేసేలా చెరువులుగా రూపాంతరం చెందాయి. పర్యావరణవేత్తలు చేసిన ఆందోళనలు చేసిన ఫలితంగా మొక్కల నరికివేత కొంతమేర తగ్గింది. మళ్లీ నరికివేత ఊపందుకుంది.
తీర ప్రాంతంలో మడ అడవుల వృద్ధి కోసం ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు నిధులు కేటాయించేది. ఏవో ఒకట్రెండు సంస్థలు లక్ష్యం మేర పనిచేసినా ఎక్కువ శాతం నిధులు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ పరంగానే చర్యలు చేపట్టడం ప్రారంభించారు. వనసంరక్షణలో భాగంగా అటవీశాఖ పరంగా, మడ వృద్ధి చర్యలో భాగంగా వన్యప్రాణి సంరక్షణ విభాగం పరంగా చర్యలు చేపడుతున్న గణాంకాల్లో ఘనంగా కనిపిస్తుంటాయి. వాస్తవంలో అందుకు తగ్గ ఫలితాలు మాత్రం కానరావడం లేదు.

Related Posts